జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బుధవారం హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లోని ఆరు రాష్ట్రాల్లోని 100కి పైగా సోదాలు నిర్వహించింది. వివిధ ఉగ్రవాద గ్రూపులతో గ్యాంగ్‌స్టర్‌లకు, డ్రగ్స్ స్మగ్లింగ్ మాఫియాకు ఉన్న సంబంధాలపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ రంగంలోకి దిగింది.
గ్యాంగ్‌స్టర్లపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఉక్కుపాదం మోపుతోంది. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. గ్యాంగ్‌స్టర్లు, టెర్రర్ గ్రూపులు, డ్రగ్స్ మాఫియా మధ్య సంబంధానికి సంబంధించిన కేసులకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఎనిమిది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తోందని అధికారులు తెలిపారు.
Huge Mob Attacks Delhi Cops After 3 Nigerians Detained: ఢిల్లీ పోలీసులపై నైజీరియన్ దేశస్తులు దాడి చేశారు. అక్రమంగా నివసిస్తున్న ముగ్గురు నైజీరియన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో సమారు 100కు పైగా వ్యక్తులు పోలీసు విధులకు ఆటంకం కలిగించారు. పోలీసులను చుట్టుముట్టి ముగ్గుర్ని విడిపించే ప్రయత్నం చేశారు. పోలీసులపై వాగ్వాదానికి దిగి దాడి చేసే ప్రయత్నం చేశారు. యాంటీ డ్రగ్స్ ఫోర్స్ పోలీసులు వీసా గడువు ముగియడంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్స్…
29 Killed During Capture Of Drug Lord El Chapo's Son: మెక్సికన్ డ్రగ్ లార్డ్ జోక్విన్ ఎల్ చాపో గుజ్మాన్ కొడుకు ఒవిడిలో గుజ్మాన్ ను పట్టుకునేందుకు మెక్సికో ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో దాదాపుగా 29 మంది మరణించారు. ప్రస్తుతం జోక్విల్ గుజ్మాన్ మెక్సికోలో జైలులో ఉన్నాడు. ప్రభుత్వ దళాలు, గుజ్మాన్ ముఠాకు చెందిన సభ్యుల మధ్య గురువారం భీకరమైన దాడులు కొనసాగాయి. మెక్సికో ఉత్తర రాష్ట్రమైన సినాలోవాలో ఈ కాల్పలుు చోటు చేసుకున్నాయి.
డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో ఏడుగురు వ్యాపారవేత్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ బిజినెస్ మెన్ లు డ్రగ్స్ కు అలవాటుపడ్డారు. ముంబై డ్రగ్ మాఫియా టోనీ తో వ్యాపారవేత్తలు నిత్యం డ్రగ్స్ తెప్పించుకున్నట్లు దర్యాప్తులో తేలింది. పాత బస్తీ కేంద్రం గా మసాలా దినుసులతో ప్రతి ఏడాది వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఆనంద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంతో పాటు…
డ్రగ్స్ రవాణాకు ట్రాన్సిట్ హబ్ గా మారింది హైదరాబాద్. ఇక్కడ నుంచి నుంచి వందల కిలోల డ్రగ్స్ ఆస్ట్రేలియాకు రవాణా చేస్తున్నారు. హైదరాబాద్ ను టార్గెట్ చేసుకుంది డ్రగ్స్ మాఫియా. ఏడాది కాలంలోనే 315 కిలోల పై చిలుకు డ్రగ్స్ ను పంపింది మాఫియా. డ్రగ్స్ కు హైదరాబాద్లో ట్రాన్సిట్ పాయింట్ గా ఎంచుకుంది మాఫియా. హైదరాబాదులో ఉన్న ఇంటర్నేషన్ పార్సిల్ కొరియర్ ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తుంది. అయితే వివిధ రూపాల్లో డ్రగ్స్ ని ఆస్ట్రేలియా…