Rave Party : హైదరాబాద్ గచ్చిబౌలిలో రేవ్ పార్టీ భగ్నం.. డిప్యూటీ తహసీల్దార్ సహా పలువురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rave Party : హైదరాబాద్ నగరంలో మరోసారి రేవ్ పార్టీ బస్టింగ్ జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ టీమ్, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ వాడుతున్న పలువురిని పట్టుకున్నారు. హైదరాబాద్ మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించిన వివరాల ప్రకారం, గచ్చిబౌలి ఈగల్ టీమ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి రాజేశ్వరి నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్‌లో జరుగుతున్న రేవ్ పార్టీపై దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురిని అదుపులోకి తీసుకొని పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
Nara Rohith: నేనూ పవన్ లాగే.. పాలిటిక్స్ పై నారా రోహిత్ షాకింగ్ కామెంట్స్
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
అరెస్ట్ అయిన వారిలో క్లౌడ్ కిచెన్ యజమాని తేజ, పౌల్ట్రీ వ్యాపారి విక్రమ్, ఐటీ ఉద్యోగులు నీలిమ, భార్గవ్, వైన్ షాప్ వ్యాపారి మరియు డ్రగ్స్ వినియోగదారుడు పురుషోత్తం రెడ్డి, అలాగే ట్రాన్స్‌పోర్టర్ చందన్ ఉన్నారు. వీరి వద్ద నుంచి పోలీసులు 20 గ్రాముల కొకైన్, 8 ఎక్స్టసీ గుళికలు, 3 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెంగళూరుకు చెందిన డ్రగ్ సరఫరాదారు రాహుల్ అలియాస్ సోను, డిప్యూటీ తహసీల్దార్ మణిదీప్ పరారీలో ఉన్నారు. విచారణలో రాహుల్‌కు నైజీరియన్ డ్రగ్ సరఫరాదారు మైక్ లింకులు ఉన్నట్లు తేలింది. చందన్ అనే ట్రాన్స్‌పోర్టర్ ద్వారా రాహుల్ నుండి డ్రగ్స్ తెచ్చి తేజ, విక్రమ్, నీలిమలకు సరఫరా చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Anupama: కమర్షియల్ సినిమాలో 1000 తప్పులున్నా పట్టించుకోరు.. మా సినిమాకి మాత్రం ఇలానా!
తేజ, విక్రమ్, నీలిమ ముగ్గురూ కలిసి గోవా, రాజమండ్రిలో రేవ్ పార్టీలు నిర్వహించేవారని, ముఖ్యంగా మణిదీప్ రాజమండ్రిలో తన సొంత ఫామ్ హౌస్‌లో తరచూ పార్టీలను ఏర్పాటు చేసేవాడని తెలిసింది. గోవాలో కూడా ఈ బృందం పలు పార్టీలను నిర్వహించింది. నీలిమ, తేజ, విక్రమ్‌లకు డ్రగ్స్ అలవాటు చేయడంలో మణిదీప్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. క్లౌడ్ కిచెన్ వ్యాపారంలో నష్టాలు వచ్చిన తర్వాత తేజ రేవ్ పార్టీలే ప్రధాన ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడు. ఈ బృందం గోవా నుండి డ్రగ్స్‌ను “బ్లూటో థియాన్” ఇంజెక్షన్ కవర్లో దాచుకుని తెచ్చినట్లు విచారణలో బయటపడింది. ఇక విక్రమ్, మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యకు సన్నిహితుడు కావడం కూడా ఈ కేసులో మరో ఆసక్తికర అంశంగా వెలుగుచూసింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!