దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ఈనెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాల పర్యటనలలో భాగంగా ఈనెల 12న ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తెలుగు రాష్ట్రాలకు రానున్నారు. ఏపీ పర్యటనలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ద్రౌపది ముర్ము సమావేశమవుతారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఆమె తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లనున్నారు. సీఎం జగన్ నివాసంలో ద్రౌపది ముర్ముకు తేనీటి విందు ఏర్పాటు…
ఈ నెల 12వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు రానున్న ఆమెకు ఘనంగా స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి
గురువారం రోజు నామినేషన్ల పరిశీలన పూర్తి చేసిన ఎన్నికల సంఘం అధికారులు.. ప్రమాణాలకు అనుగుణంగా లేని నామినేషన్లను తిరస్కరించారు.. రాష్ట్రపతి ఎన్నికల ప్రధానంగా బరిలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ పత్రాలకు ఓకే చెప్పారు..
నిత్యం వివాదాలతో సావాసం చేసే సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఏపీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేస్తామని ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. ద్రౌపది ముర్ము పై ఆర్జీవీ అనుచిత వాఖ్యలు చేయటం దురదృష్టకరమన్నారు. ఆర్జీవీ వెంటనే తన వాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆర్జీవీ సినిమా రంగంలో పనిచేసే వ్యక్తి అని,…
తొలిసారిగా ఆదివాసీ మహిళకు రాష్ట్రపతి అవకాశం దక్కడం గొప్ప విషయం అని.. ద్రౌపతి ముర్ము గెలవడం ఖాయమని అన్నారు ఎంపీ జీవీఎల్ నర్సింహరావు. ముర్ము అభ్యర్థిత్వంతో దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొందని ఆయన అన్నారు. ఇతర పార్టీలు పార్టీలు కూడా ద్రౌపతి ముర్ముకే మద్దతు పలికే పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. దేశంలో జూలై 1 నుంచి ముర్ము ప్రచారం మొదలుపెడుతారని.. ఇప్పటికే పలువురు నాయకుల మద్దతు కోరారని.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు…
తమ రాష్ట్రానికి చెందిన శ్రీమతి ద్రౌపది ముర్మును దేశ అత్యున్నత పదవికి ఎన్నుకోవడానికి ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు.. ఒడిశా శాసనసభ సభ్యులందరికీ విజ్ఞప్తి చేశారు సీఎం నవీన్ పట్నాయక్