Hyderabad: హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో మద్యం మత్తులో కారు బీభత్సం సృష్టించింది. కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ దగ్గర ద్విచక్ర వాహన దారుని ఢీకొట్టిన కారు.. దీంతో పాటు మద్యం మత్తులో యువతులు హల్ చల్ చేశారు.
రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి ప్రేమ్‌చంద్ బైర్వా కుమారుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బైర్వా కొడుకు రీలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. వారి వెనుకాల పోలీసుల ఎస్కార్ట్ వాహనాలు వస్తున్నాయి. వీడియోలో ఓపెన్ జీపులో నలుగురు యువకులు కూర్చుని ఉన్నారు. కారులో కూర్చున్న యువకుల్లో ఒకరు డిప్యూటీ సీఎం ప్రేమ్‌చంద్ బైర్వా కుమారుడు ఉన్నాడు.
ఈ మధ్య యువతరం చేస్తున్న చేష్టలు భయాందోళన కలిగిస్తు్న్నాయి. సోషల్ మీడియాలో ఫేయస్ కోసమో.. వ్యూస్ కోసమో తెలియదు గానీ.. ప్రమాదకర స్థితిలో రీల్స్ చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ముంబైలో రీల్స్ చేస్తూ ఒక ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రాణాలు కోల్పోయింది.
Google + AI : గత కొంతకాలంగా AI పట్ల ప్రజల్లో విస్తృతమైన అవగాహన పెరుగుతోంది. ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ అనేక టెక్ కంపెనీలు తమ సర్వీసుల్లో AIని ప్రవేశపెట్టడం ప్రారంభించాయి.
నాగాలాండ్ పర్యాటక శాఖ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన షేర్ చేసిన వీడియోలు యూజర్లకు బాగా నచ్చుతాయి. తాజాగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ బామ్మ అద్భుతంగా కారు డ్రైవింగ్ చేస్తోంది. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని ఈ బామ్మ మరోసారి నిరూపించిందని ట్వీట్ చేశాడు.
మద్యం సేవిస్తూ వాహనాలు నడుపరాదు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ పోలీసుల నినాదం. మద్యం సేవిస్తూ వాహనాలను నడిపితే జరిమానా విధించడంతోపాటు కేసులు సైతం నమోదు చేస్తారు.
ఓ వ్యక్తి ప్రవహించే వరదలో కారు నడుపుతున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది కొండ ప్రాంతం.. అక్కడ చిన్న పొరపాటు జరిగినా.. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఆ వీడియోలో వరదలో నుంచి ఎలా వెళ్తున్నాడో మీరు చూడవచ్చు. ప్రవహిస్తున్న నదిని లెక్కచేయకుండా వాహనాన్ని ముందుకు పోనిస్తున్నాడు. చిన్న పొరపాటు జరిగినా తన పరిస్థితి ఏమవుతుందో అని అస్సలు భయపడడు.
Viral : డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. కాస్త నిర్లక్ష్యం వహించినా ప్రాణాలు పొగొట్టుకునే ప్రమాదం ఉంది. కుటుంబాలు రోడ్డున పడుతాయి. మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత నిర్లక్ష్యంగా ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు కారణమైన ఘటనలు కోకొల్లలు. అందుకే ప్రభుత్వాలు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని ఎంత హెచ్చరించినా కొందరు మారడంలేదు.
ప్రముఖ చెల్లింపుల సంస్థ పేటీఎంకు మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్శేఖర్శర్మను అరెస్ట్ చేశారు పోలీసులు.. విషయం ఏంటంటే.. ర్యాష్డ్రైవింగ్కేసులో ఆయనను అరెస్ట్ చేశారు.. అయితే, అదే రోజు బెయిల్‌పై విడుదల చేశారు పోలీసులు.. Paytm వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ.. జాగ్వార్ ల్యాండ్ రోవర్ నడుపుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి, అది దక్షిణ ఢిల్లీ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ కారును ఢీకొట్టినట్టు పోలీసులు తెలిపారు.. కేసులో నమోదు చేసిన…