పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి గిరిజన నాయకురాలిగా చరిత్ర సృష్టించిన ద్రౌపది ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా సోమవారం ప్రత్యేక వస్త్రధారణతో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె రంగురంగుల దారాలతో నేసిన సంప్రదాయ సంతాలీ చీరను ధరించారు.
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రధాని, ఉపరాష్ట్రపతితో పాటు విదేశీ ప్రముఖులు ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని కళాకారులు సైతం వినూత్నంగా నూతన రాష్ట్రపతికి అభినందనలు తెలిపారు.
రాష్ట్రపతి అంటే దేశ ప్రథమ పౌరుడు లేదా పౌరురాలు అని అర్థం. అందుకే రాష్ట్రపతి పదవిని అత్యున్నత పదవిగా అందరూ భావిస్తారు. అలాంటి అత్యున్నత పదవిని గిరిజన మహిళ ద్రౌపది ముర్ము సొంతం చేసుకున్నారు.
రాష్ట్రపతి పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా రామ్‌నాథ్ కోవింద్ జాతినుద్దేశించి వీడ్కోలు ప్రసంగం ఇచ్చారు. పౌరులు మహాత్మా గాంధీ జీవితం, బోధనల గురించి ప్రతిరోజూ కనీసం కొన్ని నిమిషాల పాటు ఆలోచించాలని కోరారు. ఉత్తరప్రదేశ్‌లోని పర్వౌంఖ్ గ్రామంలో అతి సాధారణ కుటుంబంలో పుట్టిన తాను భారత రాష్ట్రపతిగా ఎన్నిక కావడం దేశ ప్రజాస్వామ్య పటిష్టతను సూచిస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు.
దేశ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్మును తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రతినిధి, రిటైర్డు ఐఏఎస్ అధికారి రామచంద్రు తేజావత్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రజలు, దేశవ్యాప్తంగా ఆదివాసీల తరపున శుభాకాంక్షలు తెలిపారు. ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.