రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థి ఎవరు? అనే ఉత్కంఠకు విపక్షాలతో పాటు అధికార పక్షం తెరదించింది.. ఇవాళ ఢిల్లీలో సమావేశమైన విపక్షాలు సుదీర్ఘ అనుభవం ఉన్న యశ్వంత్ సిన్హాను బరిలోకి దించగా.. ఇక, అనూహ్యంగా ద్రౌపది ముర్ము పేరును ప్రకటించింది బీజేపీ అధిష్టానం.. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో రాష్ట్రపత�
గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ.. ఇవాళ సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.. ఈ విషయాన్ని సమావేశం ముగిసిన తర్వాత మీడియాకు విరించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.