Draupadi Murmu Oath as 15th President Of India
భారత్ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. భారత రాష్ట్రపతిగా అత్యంత పిన్న వయస్కురాలు ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. అయితే.. ప్రతిభా పాటిల్ తర్వాత భారత రాష్ట్రపతి గా ద్రౌపది ముర్ము రెండవ మహిళ. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి 29 మంది మీడియా అధిపతులకు ఆహ్వానించారు. 79 మంది ఫోటోగ్రాఫర్లు, టీవీ కెమెరామన్లు కు అనుమతితో పాటు.. మీడియా ప్రతినిధులకు 1 గంటకు పార్లమెంట్ లో ప్రవేశానికి అనుమతించారు. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు ఉదయం 8.30 గంటలకు రాజ్‌ఘాట్ లో జాతిపిత మహాత్మ గాంధీ కి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించనున్నారు. అలాగే.. రాజ్‌ఘాట్ నుంచి తన తాత్కాలిక నివాసానికి తిరిగి వెళ్ళి, అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ కు ఈ రోజు ఉదయం 9.22 గంటలకు ద్రౌపది ముర్ము చేరుకోనున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ భవనంకు వచ్చిన ద్రౌపది ముర్ము ను ప్రధాని మోడీ, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎమ్.వెంకయ్య నాయుడు, లోకసభ స్పీకర్ ఓం బిర్లా లు పార్లమెంట్ “సెంట్రల్ హాల్” కు తీసుకెళ్తారు.
పార్లమెంట్ సెంట్రల్ హాల్ కు ఈ రోజు ఉదయం 10.10 గంటలకు చేరుకోనున్న ద్రౌపది ముర్ము.. ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో భారత రాష్ట్రపతి గా ప్రమాణ స్వీకారం చేస్తారు. భారత రాష్ట్రపతి గా ఎన్నికైన ద్రౌపది ముర్ము తో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వీ.రమణ ప్రమాణ స్వీకారం చేయుంచనున్నారు. కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దౌత్యాధికారులు, ఉన్నాతాధికారులు, త్రివిధ దళాధిపతులు భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఉదయం 10.23 గంటలకు భారత 15 వ రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. నూతన రాష్ట్రపతికి గౌరవ సూచకంగా 21 సార్లు “గన్ సెల్యూట్”. సెంట్రల్ హాల్‌లో పదవీ బాధ్యతల ప్రమాణ స్వీకారం అనంతరం, సంప్రదాయరీతిలో అశ్వ శకటం లో అధికార లాంఛనాలతో రాష్ట్రపతి భవన్‌కు 10.57 గంటలకు రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము చేరుకోనున్నారు. వర్షం లేకపోతే రాష్ట్రపతి భవన్ ఫోర్‌కోర్ట్‌లో ఉదయం 9.42 గంటలకు రాష్ట్రపతి గౌరవార్థం సంప్రదాయంగా జరిగే వేడుక కార్యక్రమం నిర్వహణ జరుగనుంది. వర్షం ఉంటే నిర్వహించాల్సిన ఈ వేడుక కార్యక్రమం రద్దు జరిగే అవకాశం ఉంది.