రాష్ట్రపతి ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. ఇప్పటికే ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఆదివాసీ మహిళ, మాజీ గవర్నర్ ద్రౌపతి ముర్మును ఖరారు చేశారు. అయితే సమీకరణాలు ఎలా ఉన్నా ద్రౌపతి ముర్ము విజయం సాధిస్తుందనేది ఖాయం. ఇప్పటికే వైసీపీ, బిజూ జనతాదళ్ పార్టీలు ముర్ముకు మద్దతు ప్రకటించాయి. దీంతో ఎన్డీయే బలంలో కలుపుకుని 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లే ద్రౌపతి ముర్ముకు పడుతాయి. అయితే బీజేపీ మాత్రం రాష్ట్రపతి ఎన్నికలను ఏకగ్రీవం చేసేలా ప్రయత్నాలు…
రామ్ గోపాల్ వర్మ పనికి మాలిన వ్యక్తి.. అయన తాగి ట్వీట్స్ చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆర్జీవీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై బీజేపీ మండిపడింది. అతడు చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్ లో బీజేపీ నేతలు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు వినిపిస్తున్న విషయం విదితమే. ఇక ఈ నేపథ్యంలోనే ఆమెను ఉద్దేశిస్తూ వర్మ ఒక ట్వీట్ చేశాడు. “ఒకవేళ ద్రౌపది ప్రెసిడెంట్ అయితే.. ఇక్కడ పాండవులు ఎవరు..? ఇక ముఖ్యంగా కౌరవులు ఎవరు..?”…
మోడీ నిర్ణయాలతో బాబా సాహెబ్ అంబేద్కర్ తృప్తి చెందుతారని రాష్ట్ర అద్యక్షుడు అన్నారు. ప్రధాని మోడీ, జేపీ నడ్డాల కృషితోనే ఆదివాసీ మహిళ రాష్ట్రపతి కాబోతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. కాగా.. ప్రధాని మోదీ, బీజేపీ అద్యక్షుడు జేపీ నడ్డాకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీలకు అవకాశం ఇచ్చినందుకు ప్రశంసల వర్షం కురిపించారు. ద్రౌపతి ముర్ము తల్లిగా దేశ సేవ చేస్తారని ఆకాంక్షించారు. జులై 3న సికింద్రాబాద్ ప్రధాని మోడీ సభకు గిరిజన,…
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ము నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి ఆమె నామపత్రాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు పాల్గొంటారు. ముర్ము నామినేషన్పై మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్, నడ్డా, ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ సీఎంలు సంతకాలు చేయనున్నారు. మొదటగా ప్రధాని మోదీ.. ముర్ము…
1. నేడు యథాతధంగా ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఇవాళ్టి సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది. 2. నేడు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానిమోడీ, కేంద్రమంత్రులు, సీఎంలు హజరుకానున్నారు. నామినేషన్ ను ప్రతిపాదించనున్న 50 మంది సభ్యులు. 3. నేడు అగ్నిపథ్ ఆందోళనకారులతో రేవంత్ ములాఖత్ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చంచల్ గూడ జైలులో…
ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం పూర్తికావడంతో రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎన్డీఏ ప్రకటించింది. ఈనెల 24న శుక్రవారం నాడు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్మూకు ఏపీలోని వైసీపీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు వైసీపీ ప్రెస్ నోట్ విడుదల చేసింది. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఒక గిరిజన మహిళకు ఇవ్వడం శుభ…
ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీ నేత, మాజీ గవర్నర్ ద్రౌపతి ముర్మును ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. గురువారం వరసగా ప్రధానితో సహా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడితో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు ద్రౌపతి ముర్ముకు ఘనంగా స్వాగతం పలికారు. ఇదిలా ఉంటే రేపు (జూన్ 24)న…
. 64 ఏళ్ల ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గితే.. దేశంలో అత్యున్నత రాజ్యాంగబద్ధ పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా తన పేరును చరిత్రలో లిఖించనున్నారు. ప్రతిభాపాటిల్ తర్వాత రాష్ట్రపతి పదవి చేపట్టిన రెండో మహిళగా నిలవనున్నారు.