1. నేడు యథాతధంగా ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఇవాళ్టి సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది.
2. నేడు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానిమోడీ, కేంద్రమంత్రులు, సీఎంలు హజరుకానున్నారు. నామినేషన్ ను ప్రతిపాదించనున్న 50 మంది సభ్యులు.
3. నేడు అగ్నిపథ్ ఆందోళనకారులతో రేవంత్ ములాఖత్ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చంచల్ గూడ జైలులో ఆందోళనకారులను కలువనున్నారు.
4. నేడు ఫిల్మ్ ఛాంబర్ కీలక సమావేశం నిర్వహించనుంది. ఉదయం 11 గంటలకు సమన్వయ కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి నిర్మాత దిల్ రాజు అధ్యక్షత వహించనున్నారు.
5. నేటి నుంచి అంతరిక్షంలో గ్రహాల పరేడ్ జరుగనుంది. ఒకే కక్ష్యలోకి ఐదు గ్రహాలు రానున్నాయి. 10 రోజులపాటు కనబడే అవకాశం ఉంది.
6. నేడు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650లుగా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,990లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.66,000లుగా ఉంది.