రోజు రోజుకి ట్రంప్ సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. తాజాగా మంగళవారం ట్రంప్ సివిల్ వ్యాపారం పైన న్యూయార్క్ న్యాయమూర్తి నిషేధాజ్ఞలు జారీ చేశారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ షాక్ తగిలింది. 2024 రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి గట్టిగా ప్రయత్నిస్తున్న ట్రంప్ కు న్యూయార్క్ కోర్ట్ ట్విస్ట్ ఇచ్చింది. తన కంపెనీ ఆస్తుల విలువను అధికంగా అంచనా వేయడం ద్వారా ట్రంప్, ఆయన కుమారులు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ తేల్చింది. తన ఆస్తుల విలువను డాక్యుమెంట్లలో భారీగా చూపించి, పలు బ్యాంకులు, బీమా సంస్థలను, ఇతరులను ట్రంప్ మోసం చేశారన్న న్యూయార్క్ కోర్ట్ న్యాయమూర్తి ఆర్థర్ ఎంగ్రోన్…
US presidential race: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. 2024లో యూఎస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి, ఈ నేపథ్యంలో అక్కడి ప్రెసిడెంట్ రేసు మొదలైంది. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల్లో అధ్యక్ష బరిలో నిలిచేందుకు పలువురు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష రిపబ్లిక్ పార్టీలో ఈ పోటీ ఎక్కువగా ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఇండో అమెరికన్లు వివేక్ రామస్వామి, నిక్కీ హెలీ లాంటి వారు పోటీలో ఉన్నారు.
Vivek Ramaswamy: చైనా గుత్తాధిపత్యం, సైనిక దూకుడు, విస్తరణవాదాన్ని అడ్డుకోవాలంటే భారతదేశం మాత్రమే సరైందని అమెరికాతో పాటు అన్ని యూరోపియన్ దేశాలు, జపాన్, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాలు భావిస్తున్నాయి. దీంతో భారతదేశంతో చైనా వ్యతిరేక దేశాలు సఖ్యతతో వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ నేత, ఇండో-అమెరికన్ వివేక్ రామస్వామి కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరణించారంటూ సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్ట్ కలకలం సృష్టించింది. డోనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు డోనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్విటర్ ఖాతా నుంచి ఈ పోస్ట్ వెలువడడం దీనికి కారణమైంది. అనంతరం ట్రంప్ కుమారుడు దీనికి వివరణ ఇచ్చారు.
Former US President Donald Trump hosted a Golf game for MS Dhoni: భారత్ తరఫున ఆడేప్పుడు నిత్యం బిజీబిజీగా ఉండే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. రిటైర్మెంట్ ఇచ్చాక తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సరదా సమయం గడుపుతున్నాడు. ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌ను విజేతగా నిలిపిన మహీ.. ఆపై కొన్ని రోజులు రాంచీ వీధుల్లో చక్కర్లు కొట్టాడు. అనంతరం చెన్నైలో సినిమా ప్రమోషన్స్‌లో హంగామా చేశాడు.…
Vivek Ramaswamy: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష రిపబ్లిక్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ తీవ్రంగా ఉంది. వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ లాంటి భారతీయ అమెరికన్లు అధ్యక్ష రేసులో ఉన్నారు. అయితే వివేక్ రామస్వామి అమెరికన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా సంచలన ప్రకటన చేశారు. 2020లో ట్రంప్ ఓడిపోయిన సమయంలో యూఎస్ క్యాపిటల్ పై దాడి చేసిన వారందరికి క్షమాభిక్ష ప్రసాదిస్తానంటూ హామీ ఇచ్చారు.
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో ప్రధాన పార్టీలైన డెమెక్రాట్లు, రిపబ్లికన్ పార్టీల్లో ప్రెసిడెంట్ అభ్యర్థిత్వం కోసం పోటీ నెలకొంది. ముఖ్యంగా ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీలో డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే భారతీయ అమెరికన్ వివేక రామస్వామి కూడా ఈ సారి రిపబ్లికన్ పార్టీ తరుపున ప్రెసిడెంట్ పోటీలో ఉన్నారు.
Donald Trump Mug shot: 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిన కేసులో ఆ దేశ మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ గత వారం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. గత గురువారం ట్రంప్ జార్జియా జైలులో లొంగిపోయారు. అయితే ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన వెంటనే బెయిల్ పై విడుదలయ్యారు. అయితే అరెస్ట్ చేసినప్పుడు అందరి నిందుతులు లాగానే ట్రంప్ మగ్ షాట్ ( నిందుతులకు జైలులో తీసే ఫోటో) తీశారు. అయితే…
Donald Trump X(Twitter) Re Entry: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు ఎక్స్(ట్విటర్)లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. దాదాపు రెండున్నర ఏళ్లకు పైగా ట్రంప్ ఎక్స్(ట్విటర్)వాడలేదు. 2021లో అమెరికా అధ్యక్ష కార్యాలయం వద్ద జరిగిన అల్లర్లలో ట్రంప్ పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ట్విటర్ ఖాతాను అప్పట్లో నిలిపివేశారు. దీంతో ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరు ట్రూత్. దాని…