అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణస్వీకారం చేశారు. డొనాల్డ్ ట్రంప్ కంటే ముందుగా జేడీ వాన్స్ ప్రమాణం చేశారు. జేడీ వాన్స్ చేత అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. అగ్ర రాజ్యానికి 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం చేశారు. ట్రంప్ చేత అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు.