Murder: బెలగావి జిల్లా రామదుర్గ తాలూకాలోని ఖాన్‌పేట్ సమీపంలో జూలై 7న ఒక వ్యక్తి దారుణంగా హత్య చేయబడిన స్థితిలో మృతదేహం గుర్తించబడింది. మెడకు టవల్‌తో బిగించి, మర్మాంగంపై దాడి చేసి, తలపై కండరంతో కొట్టి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యపై కేసు నమోదు చేసిన రామదుర్గ పోలీసులు, మృతుడిని ధారవాడ అమ్మినబావి గ్రామానికి చెందిన ఈరప్ప ఆడిన్‌గా గుర్తించారు. కేసును లోతుగా విచారించగా, హత్య వెనుక హృదయాన్ని కలచివేసే కుటుంబ రహస్యాలు వెలుగులోకి…
Dowry abuse: యూఏఈ షార్జాలో వరకట్న వేధింపులకు గురైన కేరళకు చెందిన మహిళ, తన బిడ్డను చంపి, తాను ఆత్మహత్యకు పాల్పడింది. మహిళ తల్లి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. కొల్లంలోని కుందార పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ ప్రకారం.. జూలై 8న షార్జాలోని అల్ నవ్దాలో 32 ఏళ్ల విపంజిక మణి తన ఒకటిన్నర ఏళ్ల కుమార్తె వైభవితో చంపి, తాను తనువు చాలించింది.
Woman kills husband: కుటుంబ కలహాల కారణంగా ఓ భార్య, తన భర్తను హత్య చేసి, ఇంట్లోనే పాతిపెట్టింది. ఈ ఘటన అస్సాం రాజధాని గౌహతిలో జరిగింది. ఈ కేసులో 38 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలు రహిమా ఖాతున్‌ని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన వ్యక్తిని సబియాల్ రెహమాన్(40)గా గుర్తించారు. ఇతను వృత్తిరీత్యా స్క్రాప్ డీలర్. రహిమా, తన భర్త సబియాల్‌ని జూన్ 26న హత్య చేసింది.
బెంగళూరు హనుమంత నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునేశ్వర లేఅవుట్‌లో జరిగిన ఒక దారుణ సంఘటన కన్నడ టెలివిజన్ పరిశ్రమను కలవరపెట్టింది. ప్రముఖ టీవీ నటి, యాంకర్ అయిన మంజుల, (స్క్రీన్ నేమ్ శ్రుతి) భర్త అంబరీష్ చేతిలో కత్తిపోట్లకు గురైంది. జూలై 4న జరిగిన ఈ దాడి ఆలస్యంగా వెలుగులోకి రాగా, నిందితుడైన అంబరీష్‌ను పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. తలను గోడకు కొట్టి జూలై 4న, ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం…
ఆ మధ్య ఓ భర్త తన భార్య ముక్కు అందంగా ఉందని.. ఏదోరోజు కొరుక్కు తింటానని చెప్పి చివరకు అన్నంత పని చేశాడు. మరో ఘటనలో ప్రియుడితో ప్రేమాయణం కొనసాగిస్తుందని కోపంతో ఊగిపోయిన భర్త తన భార్య ముక్కు కొరికాడు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. ఓ భర్త తన భార్య ముక్కును కొరికాడు. దీనికి గల కారణం ఏంటంటే.. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించే విషయంలో తలెత్తిన వివాదం ఈ ఘటనకు దారితీసింది. గాయపడిన…
వాళ్లిద్దరూ భార్యాభర్తలు… పెళ్లైన మొదట్లో అంతా బాగానే ఉంది… తర్వాత అనుమానం రోగం భర్తను వెంటాడింది… పెద్దలు సర్దిచెప్పినా అనుమానం తీరలేదు… చివరకు ఊరు మారితే మనిషి మారతాడనుకున్నాడని భార్య భావించింది… కానీ అనుమానం పెనుభూతంగా మారింది… చివరకు భార్యను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు… దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వీరి పేర్లు వెంకటేశ్వర్లు, కృష్ణకుమారి. వెంకటేశ్వర్లుది పల్నాడు జిల్లా బొల్లాపల్లి. అదే మండలం మేళ్లవాగుకు చెందిన కృష్ణకుమారికి…
Murder : జనగామ జిల్లా పిట్టలోనిగూడెంలో కట్టుకున్న భర్తను ఇద్దరు భార్యలు కడతేర్చారు. తమ తల్లిని హతమార్చడంతో.. కట్టుకున్న భర్తపై పగ తీర్చుకున్నారు. దీంతో పిట్టలోనిగూడెంలో రెండు హత్యలు జరిగాయి. ఈ హత్యలు జనగామ జిల్లాలో సంచలనం సృష్టించాయి. ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు కాలియా కనకయ్య. ఇతనికి చొక్కమ్మ, గౌరమ్మ అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. వారిద్దరు సొంత అక్కాచెల్లెళ్లు… కాలియా కనకయ్య.. సొంత ఊరు జనగామ జిల్లా పిట్టలోని గూడెం. అతడు…
Bengaluru: బెంగళూర్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్యభర్తల మధ్య గొడవ భార్య హత్యకు దారి తీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం కారణంగా కోపంతో భర్త భార్యను హత్య చేశాడు. భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో చనిపోయే వరకు తొక్కుతూ చంపాడు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
భర్తలను భార్యలు మట్టుబెడుతున్న అనేక ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ ప్రరిడిలో దారుణ ఘటన చోటు చేసుకుంది.. బండరాయితో తలపై మోది భర్తను హత్య చేసింది భార్య. భర్త మద్యానికి బానిసై తరచూ తనను వేధిస్తున్నాడని భార్య ఆరోపించింది.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్లో ఒక మహిళ పెళ్లి రోజు రాత్రి తన భర్తను చూసి ఆశ్చర్యపోయింది. తన భర్త నపుంసకుడు అని ఆరోపిస్తోంది. తన అత్తమామలు కట్నం కోసం నపుంసకుడితో తనకు వివాహం చేశారని ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని తన అత్తామామలకు చెబితే కొట్టి చంపడానికి ప్రయత్నించారని తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త, మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.