Delhi Murder: దేశ రాజధానిలో ఘోరం వెలుగుచూసింది. ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 17లో ఓ వ్యక్తి తన అత్తను, భార్యను కత్తెరతో హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. కుమార్తె పుట్టినరోజున వచ్చిన బహుమతి విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం చోటుచేసుకోవడంతో నిందితుడు తన భార్య, అత్తగారిని కత్తెరతో హత్య చేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తెరలను స్వాధీనం చేసుకున్నట్లు…
రాంగ్ కాల్‌లో పరిచయం.... ఆపై ప్రేమ ....పెళ్లి ... పిల్లలు ...ఇలా సంతోషంగా సాగుతున్న జీవితంలో భార్య తప్పటడుగులు.... భర్త పెంచుకున్న అనుమానంతో , ప్రేమించి పెళ్లాడిన భార్యను దారుణంగా హతమార్చి, పెట్రోల్ పోసి నిప్పంటించాడు భర్త.
కట్నం ఎంత ఇచ్చినా.. కొంత మంది కిరాతక భర్తలు సంతృప్తి పడడం లేదు. ఇంకా ఇంకా డబ్బులు కావాలని అని.. భార్యలను వేధిస్తూనే ఉన్నారు. వారి వేధింపులకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. అంతే కాదు అడిగినంత అదనపు కట్నం తీసుకు రాకుంటే అంతే సంగతులు.
Dowry Harassment: హైదరాబాద్ నగరంలోని చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వరకట్న వేధింపులు మరొక కుటుంబాన్ని కుదిపేశాయి. 29 ఏళ్ల వివాహిత జె.కావ్య అలియాస్ మానస ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. మృతురాలి కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం మూడు సంవత్సరాల క్రితం కావ్యకు రాజుతో వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది కాలంలోనే భర్త రాజు అదనపు కట్నం కోసం ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడని.. అలాగే పిల్లలు పుట్టడం లేదని మానసికంగా, శారీరకంగా హింసించాడని వారు ఆరోపిస్తున్నారు.…
Newly Married Women’s Suicides: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయంటారు..!! కానీ కొన్ని పెళ్లిళ్లు మాత్రం వధువులకు.. నరకప్రాయంగా మారుతున్నాయి. పెళ్లి తర్వాత ఆ నరకంలో ఉండలేక.. కాళ్ల పారాణి ఆరక ముందే ఉసురు తీసుకుంటున్నారు. దీంతో పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఇంట్లో మరణ మృదంగం మోగుతోంది.
Vuyyuru Domestic Violence: కృష్ణా జిల్లా ఉయ్యూరులో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. శాడిస్ట్ భర్త రాంబాబు చిత్రహింసలు భరించలేక ఉరివేసుకొని శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుంది. రాంబాబు అకృత్యాలను సూసైడ్ లెటర్లో శ్రీవిద్య వివరించింది. తల్లిదండ్రులకు భారం కాకూడదనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, శాడిస్ట్ భర్తను వదలొద్దని లెటర్లో శ్రీవిద్య రాసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. Also Read: Jagadish Reddy vs Kavitha: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు జగదీష్…
Woman Constable Suicide: ఓ మహిళా కానిస్టేబుల్‌గా.. ఆమె క్రిమినల్స్‌తో పోరాడింది.. కానీ సొంత ఇంట్లో సమస్యలతో పోరాడేందుకు ధైర్యం సరిపోలేదు. అలా అని పోలీసు ఉన్నతాధికారులతోనూ తన సమస్యను చెప్పుకోలేదు. ఫలితంగా సమస్యకు తలొగ్గి జీవితాన్ని త్యజించింది. హైదరాబాద్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం అందరినీ కలిచివేస్తోంది.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ తన భర్తను చంపేందుకు తన సోదరులతో కలిసి ప్లాన్ చేసింది. దాదాపుగా మరణం అంచులో ఉన్న సదరు వ్యక్తి ఓ అపరిచిత వ్యక్తి మూలంగా రక్షించబడ్డాడు. ఈ ఘటన రాష్ట్రంలోని బరేలీలో జరిగింది. డాక్టర్ సహాయకుడిగా పనిచేస్తున్న రాజీవ్ అనే వ్యక్తి కాళ్లు, చేతులు విరిగిపోయి, తీవ్రమైన బాధతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.