ఆ మధ్య ఓ భర్త తన భార్య ముక్కు అందంగా ఉందని.. ఏదోరోజు కొరుక్కు తింటానని చెప్పి చివరకు అన్నంత పని చేశాడు. మరో ఘటనలో ప్రియుడితో ప్రేమాయణం కొనసాగిస్తుందని కోపంతో ఊగిపోయిన భర్త తన భార్య ముక్కు కొరికాడు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. ఓ భర్త తన భార్య ముక్కును కొరికాడు. దీనికి గల కారణం ఏంటంటే.. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించే విషయంలో తలెత్తిన వివాదం ఈ ఘటనకు దారితీసింది. గాయపడిన మహిళను ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Also Read:Chhangur Baba: హిందూ మహిళల మతమార్పిడికి ఇస్లామిక్ దేశాల నుంచి నిధులు.
బాధితురాలిని విద్యగా గుర్తించారు. కాగా కొంతకాలం క్రితం ఆ మహిళ లోన్ తీసుకుంది. దానికి ఆమె భర్త విజయ్ జామీనుగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆ మహిళ తీసుకున్న రుణానికి సంబంధించిన ఈఎంఐలను చెల్లించలేకపోయింది. దీంతో ఫైనాన్స్ వాళ్లు భర్త విజయ్‌ను వేధింపులకు గురిచేశారు. ఈ విషయంపై దంపతుల మధ్య వివాదం చెలరేగింది. విజయ్ తన భార్యను నేలపైకి తోసేశాడు, దీంతో ఆమె కిందపడిపోయింది.
Also Read:Chhangur Baba: హిందూ మహిళల మతమార్పిడికి ఇస్లామిక్ దేశాల నుంచి నిధులు.
ఈ సమయంలో విజయ్ తన భార్య ముక్కును కొరికాడు. దీంతో ఆ మహిళ సహాయం కోసం కేకలు వేయడం ప్రారంభించింది. ఇది విన్న ఇరుగుపొరుగువారు ఉలికిపడ్డారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని ఆ మహిళను వెంటనే చన్నగిరిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయంలో విద్యా తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యా్ప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.