5 Months Old Boy Dies in Street Dogs Attack in Shaikpet: వీధి కుక్కలు మరో చిన్నారి ప్రాణాలను బలి తీసుకున్నాయి. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడు, ఖమ్మంలోని రఘునాథపాలెం మండలంలో 5 ఏళ్ల చిన్నారి కుక్కల దాడిలో మృతి చెందిన ఘటనలు ఇంకా మన కళ్ల ముందు మెదలాడుతుండగానే.. తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని షేక్‌పేటలో వీధి కుక్కల దాడిలో 5 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. కుక్కల దాడిలో…
డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో సోదాలకు వెళ్లిన పోలీసులకు భయానక అనుభవం ఎదురైంది. అనుమానిత డ్రగ్ డీలర్ ఇంట్లో ఆకస్మిక తనిఖీ చేపట్టిన పోలీసులపై ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయి.
ముంబైలోని కొన్ని కుక్కలకు గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఏంటీ కుక్కలకు గుర్తింపు కార్డులా అని షాక్ అవుతున్నారా.. నిజమే. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీఎంసీ.. 20 వీధికుక్కలకు గుర్తింపు కార్డులను తయారు చేసి వాటి మెడలకు వేసింది.
ధోనీ చాలా కూల్‌గా పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాడు. రాంఛీలో తన నివాసంలో మూడు పెంపుడు కుక్కలతో కలిసి కేక్ కట్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
ఒక కుక్క తన నోటితో నుండి పొదల్లో ఉన్న పామును తీసుకువచ్చి తన తోటి కుక్కల మధ్యలో వదిలివేయడాన్ని మీరు చూడవచ్చు. ఈ సమయంలో పాము మొదట కుక్కల నుండి ప్రాణాలను రక్షించుకోడానికి భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆ తరువాత కుక్కల నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది జరగదు.
నంద కుమార్ మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేయడంతో.. వారు వీధికుక్కలను పట్టుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో మాజీ మేయర్ నివాసానికి సమీపంలో పట్టుబడ్డ నాలుగు కుక్కలకు మున్సిపల్ అధికారులు కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేశారు.
Woman Killed By Dogs: మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై వీధికుక్కులు దాడి చేసి ప్రాణాలు తీశాయి. అనంతరం మృతదేహాన్ని పీక్కుతిన్నాయి.
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల నియంత్రణకు ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ సూచించిన సూచనల అమలుకు చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.
Howling Dogs : కుక్క అరుపులు ఎప్పుడైనా తీక్షణంగా విన్నారా? అవి బిగ్గరగా మొరిగితే ఏడుస్తున్నాయని అంటారు. కుక్కలు తరచుగా రాత్రిపూట అరుస్తూ ఉంటాయి. కుక్కలు మనుషులకు కనపడని ఆత్మలను చూసి ఏడుస్తున్నాయని చాలా మంది అనుకుంటారు.