Rabies Deaths: భారతదేశంలో ‘‘రేబిస్ వ్యాధి’’ వల్ల మరణాలు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒక నివేదికలో.. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే 36 శాతం మరణాలు ఇండియాలోనే ఉంటున్నాయని చెప్పింది. అధికారిక గణాంకాల పరిశీలిస్తే.. దేశంలో నివేదించబడిన రేబిస్ కేసులు, మరణాలలో దాదాపుగా 30-60 శాతం 15 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలే ఎక్కుగా ఉంటున్నారని తేలింది. చాలా వరకు వీటిని పిల్లలు నివేదించకపోవడంతోనే మరణాలు సంభవిస్తున్నట్లు చెప్పింది. 2024 క్యాలెండర్ ఇయర్‌లో 5.19…
కేరళ రాష్ట్రంలోని కోజీకోడ్‌లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్లపై ఎవరు కనిపిస్తే వారిని కరిచేస్తున్నాయి. నిన్న (ఆదివారం) ఈ కుక్కల గుంపు కనిపించిన వారిపై కనిపించినట్లుగా దాడి చేశాయి. దీంతో ఈ కుక్కలను అధికారులు అదుపులోకి తీసుకురాలేకపోయారు. దీంతో ఇవాళ (సోమవారం) ఆ ఏరియాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కుక్కల భయానికి కోజీకోడ్‌లోని కూతలి పంచాయత్ పరిధిలోని ఏడు పాఠశాలలు, 17 అంగన్వాడీలకూ నేడు సెలవు ఇచ్చారు.
Stray Dogs Issue: దేశంలో వీధికుక్కల దాడులు ఇటీవల కాలంలో చర్చనీయాంశం అయ్యాయి. తెలంగాణలో వీధికుక్కులు ఏకంగా ఓ నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసి దారుణంగా చంపాయి. ఇదే విధంగా పలు రాష్ట్రాల్లో చిన్నారులపై వీధి కుక్కలు దాడులు చేశాయి. ఇదిలా ఉంటే జార్ఖండ్ బీజేపీ ఎమ్మెల్యే బిరంచి నారాయణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో వీధికుక్కల అంశాన్ని లేవనెత్తారు.
బీహార్‌లో ఓ వీధి కుక్క బీభత్సం సృష్టించింది. ఒక్కరోజే 80 మందిని కరిచి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. బీహార్‌లోని అర్రాలో ఒక వీధికుక్క బుధవారం 80 మందిపై దాడి చేసిందని అధికారులు ఈరోజు తెలిపారు.