Street Dog: వీధికుక్క బీభత్సం.. ఒక్కరోజే 80 మందిని కరిచింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Street Dog: బీహార్‌లో ఓ వీధి కుక్క బీభత్సం సృష్టించింది. ఒక్కరోజే 80 మందిని కరిచి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. బీహార్‌లోని అర్రాలో ఒక వీధికుక్క బుధవారం 80 మందిపై దాడి చేసిందని అధికారులు ఈరోజు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుక్కకాటు కేసులతో 80 మందికి పైగా అర్రా జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. వీరందరిపై ఒకే కుక్క దాడి చేసిందని స్థానికులు వెల్లడించారు. కుక్కకాటు కేసులతో అర్రాలోని జిల్లా ఆసుపత్రికి దాదాపు 80 మంది వచ్చారు. రోగులలో 10-12 మంది చిన్నారులు ఉన్నారు. రోగులకు ప్రథమ చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ నవనీత్ కుమార్ చౌదరి తెలిపారు.
విషయం బయటకు పొక్కడంతో వీధికుక్కను కొట్టి చంపినట్లు తెలుస్తోంది. నగరంలోని దూద్ కటోరా ప్రాంతంలోని స్థానికులు గురువారం రాత్రి కర్రలు, రాడ్‌లతో కుక్కను కొట్టి చంపారని స్థానికులు వెల్లడించారు. రేబీస్ సోకిన కుక్క అర్రా నగరంలోని వివిధ ప్రాంతాలలో భీభత్సం సృష్టించిందని వారు పేర్కొన్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కుక్కను పట్టుకునేందుకు స్థానిక బృందాన్ని పంపించారు. ఆ బృందం చేరుకోకముందే, రాత్రి 12 గంటల సమయంలో స్థానికులు కుక్కను కొట్టి చంపారని జిల్లా అధికారి రాజ్‌కుమార్ తెలిపారు.
Also Read
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
Identical Twins: కవలల వింత కోరిక.. ఒకేసారి ఒక్కరితోనే గర్భం దాలుస్తారట..
ఈ ప్రాంతాల్లోని దాదాపు 110 నుంచి 120 మంది చిన్నారులు, వృద్ధులు, మహిళలు సహా కుక్కకాటుకు గురయ్యారు. కొందరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరారు. అనేక మంది రోగులు అర్రా సదర్ ఆసుపత్రికి రావడం ప్రారంభించిన తరువాత, ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. గురువారం అర్రా సదర్ ఆసుపత్రిలో సుమారు 86 మందికి రేబిస్ ఇంజెక్షన్లు ఇచ్చారని అధికారులు తెలిపారు. గణతంత్ర దినోత్సవం దృష్ట్యా సెలవు అయినప్పటికీ జిల్లా అధికారి ఆదేశాల మేరకు సదర్ ఆసుపత్రి ఆవరణలో శిబిరాన్ని ప్రారంభించామని అర్రా సదర్ ఆసుపత్రి మేనేజర్ కౌశల్ దూబే తెలిపారు. 86 మందికి రేబిస్ ఇంజక్షన్లు వేసినట్లు తేలింది.
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!