ఈసారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సోనూసూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ పార్టీ తరఫున మోగా నియోజకవర్గం నుండి పోటీ చేసింది. నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకూ తన జీవితాన్ని అంకితం చేసిన సోనూసూద్ ను దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సోనూ సూద్ రాజకీయ అరంగేట్రమ్ చేస్తాడనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు కానీ తన సోదరిని రంగంలోకి దించారు.…