DNA of Shraddha's father matches with bones recovered from Mehrauli forest: శ్రద్ధా వాకర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మోహ్రౌలి సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు దొరికన ఎముకలు శ్రద్ధా వాకర్‌వే అని తేలింది. పలు ప్రాంతాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎముకలను సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి విశ్లేషణకు పంపారు. తాజాగా శ్రద్ధా తండ్రి వికాస్ వాకర్ డీఎన్ఏతో ఎముకల డీఎన్ఏ మ్యాచ్ అయింది.