ప్రముఖ సీనియర్ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ (69) శుక్రవారం రాజ్యసభలోకి అడుగుపెట్టారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళంలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు.
ఇండియా కూటమి మంగళవారం సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు నేతలంతా కీలక సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజే ఆయా అంశాలపై ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తాయి. దీంతో గందరగోళం నెలకొనడంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి.
తమిళనాడులో సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్ లాకప్డెత్ రాష్ట్రాన్ని కుదిపేసింది. అత్యంత దారుణంగా పోలీసులు చితకబాదడంతో దెబ్బలు తాళలేక ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి.
Uddhav Sena: బీజేపీ ప్రభుత్వం మరాఠీ ప్రజలపై హిందీ రుద్దుతుందనే కారణంతో 20 ఏళ్ల విభేదాలను పక్కన పెట్టి ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఒక్కటయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం హిందీని మూడో భాషగా వెనక్కి తీసుకోవాలనే నిర్ణయం తర్వాత, ఠాక్రే సోదరులు శనివారం ‘‘వాయిస్ ఆఫ్ మరాఠీ’’ పేరుతో పెద్ద ర్యాలీని నిర్వహించారు.
MK Stalin: జాతీయ విద్యా విధానంలో త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా, హిందీ భాష విధింపుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, మహారాష్ట్రలో ఈ వివాదమే 20 ఏళ్ల తర్వాత రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు కలిసేందుకు సాయపడింది.
AIADMK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ప్రచారం ఊపందుకుంటోంది. దీంతో పాటు పార్టీల మధ్య పొత్తులపై కీలక చర్చ జరుగుతోంది. స్టార్ హీరో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం(టీవీకే) ఎంట్రీతో తమిళనాడులో త్రిముఖ పోరు నెలకొంది. ఇదిలా ఉంటే, విజయ్ పార్టీతో చేతులు కలపడానికి తలుపులు తెరిచే ఉన్నాయని అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి కే పళనిస్వామి(ఈపీఎస్) శనివారం చెప్పారు. బీజేపీతో తన పొత్తలో అన్నాడీఎంకే పెద్దన్న అని చెప్పారు.
ఎలక్షన్స్ తర్వాత రాష్ట్రంలో బీజేపీ, ఏఐఏడీఎంకేలతో కూడిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అన్నారు. ఇక, ముఖ్యమంత్రి అభ్యర్థి ఏఐఏడీఎంకే నుంచి ఉంటారని స్పష్టం చేశారు. కాగా, పార్టీ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి (ఈపీఎస్) పేరును అమిత్ షా ప్రస్తావించలేదు.
CM Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం (జూన్ 269న) బీజేపీ- ఏఐఏడిఎంకేలపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. మతం ప్రమాదంలో ఉందని పదే పదే చెబుతూ రాష్ట్ర ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Train Tickets Hike: ట్రైన్ టిక్కెట్ ధరలు జూలై 1వ తేదీ నుంచి స్వల్పంగా పెంచేందుకు కేంద్ర రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు తమిళనాడు మంత్రి శేఖర్ బాబు సవాల్ విసిరారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నై నుంచి పోటీ చేసే దమ్ముందా? అని పవన్ను ప్రశ్నించారు. చెన్నైలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయొచ్చని, తమిళనాడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచి చూపించాలని ఛాలెంజ్ విసిరారు. ఒకవేళ తమిళనాడు ఎన్నికల్లో పవన్ గెలిస్తే.. ఎన్ని చెప్పినా వినడానికి తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి శేఖర్ బాబు తెలిపారు. జనసేనాని తాజాగా…