Bandi Sanjay’s election campaign in Munugode: ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ మునుగోడు ఉప ఎన్నికలు.. పార్టీల మధ్య ప్రచార జోరు రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలో ఇప్పటికే పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు. గ్రామ గ్రామాన తిరుగుతూ.. ఒకరిమీద ఒకరు విమర్శనాస్త్రాలు వేసుకుంటూ.. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ పార్టీకీలక నేతలను రంగంలోకి దింపుతున్నారు. ఇక నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎన్నికల…
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మాటలను కూడా వక్రీకరించారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ప్రజలకు కేసీఆర్ అన్నీ అబద్ధాలే చెబుతున్నారన్నారు. కేసీఆర్‌కు ఎప్పుడూ రాజకీయం తప్పితే వేరే ధ్యాస లేదన్నారు.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ , టీపీసీసీ రేవంత్ రెడ్డి కి వార్నింగ్ ఇచ్చారు. నోరు భద్రంగా పెట్టుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి సమన్వయం కోల్పోయి మాట్లాడాడని మండిపడ్డారు. ఆయన ఏమైనా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగాడా? అదే పార్టీకి సేవ చేసి టీపీసీసీ అయ్యాడా? అంటూ ప్రశ్నించారు. పార్టీలు మారే కదా టీపీసీసీ అయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై, సోనియా, రాహుల్, వైఎస్సార్ పై మాట్లాడిన భాషను రేవంత్ గుర్తు చేసుకోవాలని డీకే అరుణ…