DK Aruna : కేసీఆర్ చెప్తున్న ఆ ముగ్గురు నిందితులకు బీజేపీకి ఏమి సంబంధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల మొయినాబాద్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తాజాగా సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో దుర్మార్గంగా ప్రభుత్వాలను కూల్చే కుట్ర జరుగుతోందని, బీజేపీ అగ్రనేతలపై విమర్శలు గుప్పించారు. మొయినాబాద్ ఎమ్మెల్యేల కొనుగోలు నిందితులకు సంబంధించిన పలు వీడియోలను సైతం సీఎం కేసీఆర్ విడుదల చేశారు. అయితే.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. అసలు ముఖ్యమంత్రి చెప్తున్న ఆ ముగ్గురు నిందితులకు బీజేపీకి ఏమి సంబంధమని ఆమె ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయమని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్పష్టం అయిందని, అందుకే మీడియా సమావేశంలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఆమె మండిపడ్డారు.
Also Read : CM KCR : 8 ప్రభుత్వాలు కూలగొట్టాం. మరో 4 ప్రభుత్వాలు కూలగొడుతాం.. ప్రెస్‌మీట్‌లో సంచలన విషయాలు
వీడియో చేయడానికి చాలా కష్ట పడ్డాం అని ముఖ్యమంత్రే ఒప్పుకున్నాడని, దయ్యాలు వేదాలు వల్లించి నట్లు ఉందంటూ ఆమె విమర్శలు గుప్పించారు. నలుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టిక్కెట్ పై పోటీ చేసి గెలిచారని, ముగ్గురు ఎమ్మెల్యే లను కొన్నది ఎవరు? అని ఆమె ప్రశ్నించారు. దేశ ప్రధాన మంత్రి గురించి మాట్లాడినంత మాత్రాన దేశ్ కి నేత కారని, కేసులు పై భయం లేనప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎందుకు అడ్డుకున్నావని ఆమె మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమికొడతారంటూ ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..