వీడియో మార్ఫింగ్ తో మునుగోడు ప్రజలను ఏమార్చలేరన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే ఆరుణ. ఈ మేరకు ఆదివారం ఆమె ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలలో.. మునుగోడులో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని తెలిసాక కేసీఆర్ జిత్తుల మారి వేశాలు వేస్తున్నారు. రాజకీయ నైతికతకు కట్టుబడి రాజీనామా చేసి బీజేపీ లో చేరిన రాజగోపాల్ రెడ్డి ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అనని మాటలను అన్నట్లుగా వీడియోలను మార్ఫింగ్ చేసి అయన మీద దుష్ప్రచారం చేస్తున్నారు. పైగా ఆ మార్ఫింగ్ వీడియోలతొ ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు బీజేపిలోకి రాక ముందు నుండి కొమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోది పథకాలను సమర్ధించారు.
బీజేపీలో చేరడానికి కాంట్రాక్టులకు, కాంట్రాక్టు పనులకు సంబంద లేదని ఎప్పుడో చెప్పారు. టీఆర్ఎస్ వందల కోట్ల రూపాయలని మునుగోడులో ఖర్చుపెట్టపోతుంది. దాని నుండి ఎన్నికల కమిషన్ దృష్టిని మరల్చే కుట్రలో భాగంగానే రాజగోపాల్ రెడ్డి మీద తప్పుడు ఫిర్యాదు చేస్తున్నారు. టీఆర్ఎస్ చేస్తున్న ఈ ప్రయత్నాలను చూస్తుంటేనే వారిలోని ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుంది. టీఆర్ఎస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి గెలుపును ఆపలేరని ఆమె వెల్లడించారు.