D. K. Aruna: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి పై దాడిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఖండించారు. ఇంటిపై టీఅర్ఎస్ గుండాలు దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలు కేవలం ధర్నా చెద్ధాం అనే ఆలోచన చేస్తేనే, అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసే పోలీసులు. మరి పోలీసులు ఇప్పుడు ఏమి కేసులు నమోదు చేస్తారు? అంటూ ప్రశ్నించారు. ఈ దాడికి ప్రధాన కారణమైన ఎమ్మెల్సీ కవితపై కూడా పోలీసులు కేసు నమోదు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ఎంపీ ధర్మపురి అరవింద్ కుటుంబానికి టీఅర్ఎస్ నుంచి ప్రాణహాని ఉందని డీకే అరుణ ఆరోపించారు. ఎంపీ ఇంట్లో లేరని తెలిసి కూడా ఈ దాడికి పాల్పడడం దేనికి సంకేతం అని మండిపడ్డారు.
Read also: Tension in Osmania University: ఓయూలో ఉద్రిక్తత.. వీసీ ఛాంబర్ అద్దాలు ధ్వంసం
ఇవాళ మధ్యాహ్నం ఎంపీ అరవింద్ ఇంటి ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎంపీ ఇంటిలో చొరబడ్డారు. ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు ఎంపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎంపీ ఇంటి ముందు జిస్టి బొమ్మను దగబెట్టి నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఇంటి గేటును మూసి వేసిన గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు టీఆర్‌ఎస్ కార్యకర్తలు. వారిని పోలీసులు పట్టికుని కిందికి దించారు. ఎమ్మెల్సీ కవితపై అనుచుత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్‌ఎస్ కార్యకర్తలు. దీంతో ఎంపీ ఇంటి వద్ద తీవ్ర స్థాయిలో ఆందోళన నెలకొంది. టీఆర్‌ఎస్ కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
Allu Arjun: అల్లు అర్జున్‌కు షాక్.. అప్డేట్ ఇవ్వాలంటూ రోడెక్కిన ఫ్యాన్స్