Diwali : ఈ ఏడాది దీపావళి పై ప్రజల్లో అయోమయం నెలకొంది. ఆ రోజు పండుగనాడు పాక్షిక సూర్యగ్రహణం, కార్తీక పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుండడంతో ఈ పండుగలను ఎప్పుడు జరుపుకోవాలన్న దానిపై ప్రజలు కన్ఫూజ్ అవుతున్నారు. ఈ నెల 25న సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్య గ్రహణం ఏర్పడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదే రోజున దీపావళి సెలవు ప్రకటించాయి. అయితే, 25న అమావాస్య వెళ్లిపోయి పాడ్యమి వస్తుంది. ఆ రోజు…
దసరా, దీపావళి వరుసగా పండుగలతో క్రెడిట్ కార్డులను మాములుగా వాడలేదు ప్రజలు ఈ ఫెస్టెవల్స్ ఖర్చునంతా క్రెడిట్ కార్డుల రూపం లోనే వాడారు. సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్ నెలలో క్రెడిట్ కార్డులపై ఖర్చు చేయడం 50శాతం పెరిగింది. నవంబర్ తొలివారంలోనూ ఈ జోరు కనిపించింది. సెప్టెంబర్ నెలలోనే క్రెడిట్ కార్డుల ద్వారా రూ.80 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఈ లెక్కన అక్టోబర్, నవంబర్‌లో రికార్డు స్థాయిలకు చేరుతుందని ఆర్బీఐ అంచనా వేస్తుంది. రిజర్వు బ్యాంక్…
అసలే కాలుష్యం.. ఆపై దీపావళి తోడైంది. దీంతో దేశ రాజధాని ప్రాంతం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఢిల్లీ లోని వాహనాలు, నిర్మాణాలు, రహదారులు, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంతో పాటు, పొరుగున ఉన్న హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాల్చివేత, బొగ్గు ఆధారిత విద్సుదుత్పత్తి కేంద్రాల నుంచి వెలువడే కాలుష్యం ఇబ్బందుల పాలు చేస్తోంది. దీనికి తోడు దీపావళి పండుగ కాలుష్యం కూడా తోడవడంతో పరిస్థితి విషమించింది. ధూళి అణువులు 2.5 మైక్రాన్స్ పరిమాణంలో…
యావత్ ప్రపంచంలోని భారతీయులు దీపావళిని అంగరంగ వైభవంగా జరుపుకుంటుంటారు. కరోనా కారణంగా గతేడాది పెద్దగా ఈ పండుగను నిర్వహించుకోలేకపోయారు. కరోనా నుంచి క్రమంగా బయటపడుతుండటంతో దీపావళి వేడుకను ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీపావళి రోజున పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తారు. చెడుపై మంచి విజయానికి గుర్తుగా ఈ వేడుకను నిర్వహిస్తారు. అన్ని ప్రాంతాల్లో టపాసులు కాలిస్తే, ఆ ఒక్క ప్రాంతంలో మాత్రం టపాసులకు బదులుగా కర్రలతో కొట్టుకొని రణరంగం సృష్టిస్తారు. దీనికి కారణం లేకపోలేదు.…
దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. టపాసుల మోత మోగాల్సిందే.. చిన్నా, పెద్ద ఇలా ఇంటిల్లిపాది కలిసి పటాకులు కాల్చుతూ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటారు.. అయితే, అవి ప్రమాదాలు తెచ్చిపెట్టే సందర్భాలు అనేకం.. ముఖ్యంగా.. కంటి సమస్యలకు దారి తీస్తున్నాయి.. టపాసులు కాల్చే సమయంలో.. పలు జాగ్రత్తలు తీసుకోవాలని.. ముఖ్యంగా చిన్నపిల్లలు.. పెద్దల పర్యవేక్షణలో బాణాసంచా కాల్చితే మంచిదంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నా.. నిర్లక్ష్యంగా టపాసులు కాల్చి ఇబ్బందులు పడుతూ.. ఆస్పత్రికి క్యూ కడుతున్నారు బాధితులు.. ఇక, హైదరాబాద్‌లో…
దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని తాకాయి. కరోనా కారణంగా గతేడాది దీపావళి పండుగను ప్రజలు చేసుకోలేదు. కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో ఈసారి రెండురోజుల ముందు నుంచే పండుగ వాతావరణం ఏర్పడింది. ఉదయాన్నే పూజలు చేసి, శుభం కలగాలని కోరుతూ పండుగను చేసుకుంటున్నారు. సాయంత్రం ప్రజలు ఆరుబయటకు వచ్చి బాణా సంచా కాల్చూతూ పండుగను నిర్వహించుకుంటున్నారు. హైదరాబాద్‌లో వివిధ కమ్యూనిటీల్లో ప్రజలు బాణా సంచా కాల్చుతూ పండుగను చేసుకుంటున్నారు. ఈ సారి గ్రీన్ కాకర్స్‌నే కాల్చుతు…
ఆధ్యాత్మిక నాయకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ దీపావళి సందర్భంగా “పిల్లల కోసం” బాణాసంచాపై నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఒక ఇంటర్వ్యూ వీడియోను ట్వీట్ చేశారు. మీరు జంతు ప్రేమిగల, పర్యావరణ పరంగా సున్నితమైన మానవులైతే, మీరు రోజువారీ మాంసాహారాన్ని తగ్గించాలి. ఒక రోజు ఆనందంగా పిల్లలు దానిని తిననివ్వండి” అని సద్గురు ట్వీట్ చేశారు. ప్రతిరోజూ మన ఆహారం కోసం ఈ గ్రహం మీద 200 మిలియన్లకు పైగా జంతువులను వధిస్తున్నాము” అని, “జంతువులు, పక్షులకు…
దీపావళి సందర్భంగా క్రాకర్స్ కి ఎంత హడావిడి వుంటుందో స్వీట్స్ కి కూడా అంతే. బంధు మిత్రులకు స్వీట్స్ పంచుతూ, తియ్య తియ్యని స్వీట్స్ తింటూ సందడి చేస్తారు. హైదరాబాద్ లో కరోనా భయం నుంచి కోలుకుంటోంది. దీపావళి సందర్భంగా స్వీట్ షాపుల్లో హడావిడి పెరిగింది. అన్ని వర్గాలకు అందుబాటులో వుండే విధంగా జంబో స్వీట్ ప్యాక్ లు అందుబాటులోకి తెచ్చారు నిర్వాహకులు. బొకేల తరహాలో స్వీట్స్ చేతితో తాకకుండా కరోనా నిబంధనలతో తయారుచేశారు. ఈ స్వీట్లు…
చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో గురువారం ఉదయం కేదారేశ్వర గౌరీ వ్రతం ఏకాంతంగా నిర్వహించారు. ఆలయమంతా విద్యుద్దీపాలతో అరటి చెట్లు, మావిడాకులతో సుందరంగా అలంకరించి గౌరీ దేవి అమ్మవారిని జ్ఞానప్రసూనాంబ అమ్మవారి ఎదురుగా కొలువుదీర్చారు. వివిధ రకాల పుష్పాలతో ఆభరణాలతో అమ్మవారిని చక్కగా అలంకరించారు. అనంతరం కలశ స్థాపన పుణ్య వచనము ,వరుణ పూజ, కలశానికి పుష్పాలతో కుంకుమతో పూజ చేసి హారతి సమర్పించారు. ఆపై వేద పండితులు గౌరీ వ్రతం గురించి వివరించారు.దీప…