Diwali : ఈ ఏడాది దీపావళి పై ప్రజల్లో అయోమయం నెలకొంది. ఆ రోజు పండుగనాడు పాక్షిక సూర్యగ్రహణం, కార్తీక పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుండడంతో ఈ పండుగలను ఎప్పుడు జరుపుకోవాలన్న దానిపై ప్రజలు కన్ఫూజ్ అవుతున్నారు. ఈ నెల 25న సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్య గ్రహణం ఏర్పడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదే రోజున దీపావళి సెలవు ప్రకటించాయి. అయితే, 25న అమావాస్య వెళ్లిపోయి పాడ్యమి వస్తుంది. ఆ రోజు అమావాస్య ఘడియలు ఉండవు కాబట్టి దీపావళి జరుపుకోవడం సబబు కాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. 24న ఉదయమంతా చతుర్దశి ఉంటుంది. రాత్రంతా అమావాస్య ఉంటుంది. కాబట్టి 24న లక్ష్మీపూజ చేసుకుని, రాత్రి టపాసులు కాల్చి పండుగ జరుపుకోవచ్చని అంటున్నారు.
కార్తీక పౌర్ణమి విషయంలోనూ ఇలాంటి గందరగోళమే నెలకొంది. నవంబరు 8న మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్ర 6.27 గంటల వరకు చంద్ర గ్రహణం ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత కాసేపటి వరకు చంద్ర గ్రహణం ఉంటుంది. అంటే, చంద్రగ్రహణం చివరి నిమిషాల్లో మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో కనిపించే అవకాశం ఉంది. నవంబరు 7 నుంచే పౌర్ణమి ఘడియలు ప్రారంభమవుతాయని, కాబట్టి అదే రోజున కార్తీక వ్రతాలు, పూజలు చేసుకోవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Read Also: Japan: భార్య కోసం పదేళ్లుగా సముద్రంలో వెతుకుతున్న భర్త.. దిస్ ఈజ్ రియల్ లవ్
దీపావళి.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఇంట్లోకి నూతన వెలుగులు తీసుకొచ్చే మహత్తర పండుగ. అందరూ ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినం. మతంతో సంబంధం లేకుండా అందరూ కలిసి ఆనందోత్సాహంతో దీపావళి జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజు ఈ పండుగ వస్తుంది.
Read Also: Premature Births : ముందస్తు ప్రసవాలకు ఆందోళనలే కారణమా..?
పురాణ కథనం ప్రకారం.. భూదేవి, వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు.. శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో లోకకంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టిపీడించాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేశాడు. నరకాసుర సంహారంతో అందరూ అనందంగా పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకుడి మరణించగా, ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. దీపావళి అంటే దీపాల వరుస అన్ని అర్థం. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని ఐదు రోజుల పండుగగా జరుపుకుంటారు.