జనావస సముదాయల్లో టపాసుల దుకాణాలు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి ఒక పెద్ద వేడుక ఈ పండగ సందర్భంగా జరిగే అగ్నిప్రమాదాలు నివారించడానికి టపాసుల కాల్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. ప్రతి సంవత్సరం దీపావళి కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తారు. దేశమంతటా ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున ఇళ్లను దీపాలు, దీపాలతో అలంకరిస్తారు. దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీదేవిని పూజిస్తారు కార్తీక మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తేదీన దీపావళి పండుగ జరుపుకుంటారు.
దీపావళి రోజు ఆరోగ్యంతో పాటు కంటి భద్రతపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే దీపావళి సందర్భంగా కాలుష్యం స్థాయి ఎక్కువగా పెరుగుతుంది. ఆ కాలుష్యం ఇళ్లలోకి కూడా చేరి కళ్లను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో కళ్ళను రక్షించుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా పటాకుల పొగ, కాలుష్యం కారణంగా కంటి చూపు కోల్పోయిన చాలా మంది ఉంటారు.
Ayodhya Diwali: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఎనిమిదో దీపోత్సవం సందర్భంగా సరయూ నది ఒడ్డున 28 లక్షల దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో రాంలాలా ఆలయంలో ఈసారి ప్రత్యేక దీపాలను వెలిగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నూతనంగా నిర్మించిన శ్రీరామ జన్మభూమి ఆలయంలో మొదటి దీపావళికి గ్రాండ్ గా “పర్యావరణ స్పృహ”తో సన్నాహాలు జరుగుతున్నాయి. అక్టోబరు 30న సరయూ ఘాట్‌ల వద్ద జరిగే మహా దీపోత్సవంలో 28 లక్షల దీపాలను అలంకరించేందుకు 30…
దీపాల పండుగ దీపావళి (Diwali 2024) సమీపిస్తోంది. కోట్లాది మంది భారతీయులు ఈ పండుగను మెరిసే దీపకాంతులతో వెలుగులతో ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీపావళి పండుగ మనకు ఆనందాన్ని, ఐక్యతా అనుభూతిని కలిగిస్తుంది. దీపావళి సందర్భంగా చాలా బాణాసంచా కాల్చుతారు.
ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ ‘బిగ్ సీ’.. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని డబుల్ ధమాకా ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లకు తాము నాలుగు ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తున్నట్టు సంస్థ ఫౌండర్ బాలు చౌదరి ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రతి మొబైల్ కొనుగోలుపై రూ.10 వేల విలువైన మొబైల్ ప్రొటెక్షన్, 12 వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు. అలానే రూ.5,999 విలువ గల కచ్చితమైన బహుమతి కూడా ఉంటుందని చెప్పారు. Also Read: Gold Rate Today:…
దీపావళి పండుగను ఏ తేదీన జరుపుకోవాలనే విషయంపై పంచాంగ కర్తల మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయి. దీపావళి అక్టోబర్ 31వ తేదీన కాదు.. నవంబర్ 1న జరుపుకోవాలని కోనసీమ ధృక్ సిద్ధాంత పంచాంగ కర్తలు గణన చేస్తుండగా.. లేదు లేదు.. అక్టోబర్ 31వ తేదీనే జరుపుకోవాలని రేలంగి తంగిరాల పంచాంగ కర్తలు పేర్కొంటున్నారు.
Diwali 2024 Movie Releases: ఈ ఏడాది జనవరి నుంచి పెద్ద స్టార్ల సినిమాలు విడుదల లేకుండా తమిళ సినిమా డీలా పడింది. ఏడాది సగం పూర్తి కావస్తున్నా ఎటువంటి పెద్ద సినిమా లేకపోవడంతో సినీ ప్రియులు విలవిల లాడుతున్నారు. అయితే, జూలై నుండి, అనేక పెద్ద విడుదలలు వరుసలో ఉన్నాయి. లేటెస్ట్ బజ్ ఏమిటంటే, ఈ దీపావళికి కోలీవుడ్ భారీ క్లాష్‌కి సిద్ధంగా ఉంది, ఒకేసారి తెరపైకి రావడానికి ప్లాన్ చేసిన రెండు భారీ చిత్రాలు.…