Ayodhya Diwali: ప్రపంచ రికార్డు సృష్టించేందుకు రెడీ అవుతున్న రాంలాలా ఆలయం
- ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో.
- ప్రపంచ రికార్డు సృష్టించేందుకు రెడీ..
- మహా దీపోత్సవంలో 28 లక్షల దీపాలను అలంకరించేందుకు 30 వేల మందికి పైగా వాలంటీర్ల నియామకం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Diwali: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఎనిమిదో దీపోత్సవం సందర్భంగా సరయూ నది ఒడ్డున 28 లక్షల దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో రాంలాలా ఆలయంలో ఈసారి ప్రత్యేక దీపాలను వెలిగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నూతనంగా నిర్మించిన శ్రీరామ జన్మభూమి ఆలయంలో మొదటి దీపావళికి గ్రాండ్ గా “పర్యావరణ స్పృహ”తో సన్నాహాలు జరుగుతున్నాయి. అక్టోబరు 30న సరయూ ఘాట్‌ల వద్ద జరిగే మహా దీపోత్సవంలో 28 లక్షల దీపాలను అలంకరించేందుకు 30 వేల మందికి పైగా వాలంటీర్లను నియమించారు.
Read Also: Fire Accident : అబిడ్స్‌లోని క్రాకర్స్ షాపులో భారీ అగ్నిప్రమాదం…
Also Read
- AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ప్రకారం, ఈ ప్రత్యేక రకాల దీపాలు ఆలయ భవనాన్ని మరకలు, మసి నుండి కాపాడతాయి. అలాగే ఎక్కువ సేపు కాంతిని కూడా అందిస్తాయి. శ్రీరామజన్మభూమి ఆలయాన్ని ఆకర్షణీయమైన పూలతో అలంకరించేందుకు ప్రత్యేక ప్రణాళికను కూడా రూపొందించినట్లు తెలిపారు. ఆలయ సముదాయాన్ని అనేక విభాగాలుగా, ఉపవిభాగాలుగా విభజించి అలంకరణ బాధ్యతలు అప్పగించారు. బీహార్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐపిఎస్ అధికారి అషు శుక్లాకు ఆలయంలోని ప్రతి మూలను క్రమపద్ధతిలో వెలిగించడం, అన్ని ద్వారాలను తోరణాలతో అలంకరించడం, శుభ్రపరచడం ఇంకా అలంకరణ చేయడం వంటి బాధ్యతలను అప్పగించారు. దీంతో అందమైన పూలతో, దీపాలతో అలంకరించిన ఆలయాన్ని భక్తులు దర్శించుకోనున్నారు. ఈ సారి వెలుగుల పండుగలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు ప్రతినిధి తెలిపారు.
Read Also: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నిద్రమత్తుకు ఇద్దరు బలి
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, అవధ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ ప్రతిభా గోయల్ ఉద్దేశం మేరకు సరయూలోని 55 ఘాట్‌ల వద్ద ఈ భారీ వాలంటీర్ల బృందాన్ని మోహరించారు. రెండు వేల మందికి పైగా సూపర్ వైజర్లు, కోఆర్డినేటర్లు, ఘాట్ ఇన్‌ఛార్జ్‌లు, దీపాల లెక్కింపు, ఇతర సభ్యుల పర్యవేక్షణలో 30 వేల మందికి పైగా వాలంటీర్లు ఘాట్‌ల వద్ద 28 లక్షల దీపాలను అలంకరించేందుకు కృషి చేస్తున్నారని ప్రతినిధి తెలిపారు.
తాజావార్తలు
-
AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
-
Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..