నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్ నారాయణ దాస్ నారంగ్ అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే! ఆయనకు నివాళులు అర్పిస్తూ, తెలుగు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘నారాయణ దాస్ నారాంగ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. సమస్య చిన్నదైనా, పెద్దదైనా క్షుణ్ణంగా పరిశీలించి ఆ సమస్య మళ్లీ రాకుండా…