అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అస్సాంలో తీవ్రమైన వరదల కారణంగా 30 మందికి పైగా మరణించారు. 15 జిల్లాల్లో 1.61 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. కరీంగంజ్ జిల్లాలోని బదర్‌పూర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఒక మహిళ, ఆమె ముగ్గురు కుమార్తెలు, అలాగే మూడేళ్ల బాలుడు సహా ఐదుగురు వ్యక్తులు మరణించారు.
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం సృష్టించడంతో వరద నీరు ఇళ్ల మధ్యకు చేరి తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఇక, గోదావరి వరద ఉధృతి ధవళేశ్వరం దగ్గర ఎల్లుండి నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ డా.బీఆర్ అంబేద్కర్ తెలిపారు.
ఆగ్నేయ బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో బలపడిన అల్పపీడనం కారణంగా ఉత్తారంధ్రలో భారీనుంచి తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ కమిషనర్ కె. కన్నబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది రాగల 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని, ఆ తర్వాత 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర…
వరదలను ఎదుర్కొవడంలో రాష్ర్టం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. అసలు రాష్ర్టంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఉందా అంటూ ప్రశ్నించారు. వర్షాలపై ప్రభుత్వం ఏ మాత్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని, మానవ తప్పిదం వల్లే ప్రకృతి విలయం సృష్టించిందన్నారు. వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపినప్పుడు ప్రభుత్వం ఎందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆయన మండి పడ్డారు. జలాశయాల నిర్వహణను గాలికి వదిలేశారన్నారు.…