వరదలను ఎదుర్కొవడంలో రాష్ర్టం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. అసలు రాష్ర్టంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఉందా అంటూ ప్రశ్నించారు. వర్షాలపై ప్రభుత్వం ఏ మాత్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని, మానవ తప్పిదం వల్లే ప్రకృతి విలయం సృష్టించిందన్నారు.
వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపినప్పుడు ప్రభుత్వం ఎందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆయన మండి పడ్డారు. జలాశయాల నిర్వహణను గాలికి వదిలేశారన్నారు. గతేడాది వరదలు వచ్చినప్పుడు దెబ్బతిన్న సోమశిల జలాశయం అప్రాన్‌కు మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందన్నా రు. సోమశిలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేప్టటాలని ఆయన డిమాండ్ చేశారు. వరద బాధితుల కు అందజేస్తున్న సాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ నీచ రాజకీయాలు చేస్తుందని, రానున్న రోజల్లో వైసీపీ పతనం తప్పదని సోమిరెడ్డి హెచ్చరించారు.