గవర్నర్ అబ్దుల్ నజీర్ ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీలో డ్రోన్ R&D కేంద్రాన్ని ప్రారంభించారు. కళాశాల 14వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ.. డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మెషీన్ లెర్నింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో ఒక సముచిత కెరీర్‌ను రూపొందించుకోవాలి. భారతదేశం వివిధ రంగాలలో అద్భుతమైన పురోగతి సాధిస్తోంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, డిజిటలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వివిధ రంగాలలో డ్రోన్ల వినియోగం పెరుగుతోందన్నారు.
Read Also:Money Found On Tree: మామిడి చెట్టుపై నోట్ల కట్టలు.. కోటి రూపాయలను జప్తు చేసిన ఐటీ
ప్రస్తుతం నిఘా, భౌగోళిక మ్యాపింగ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, సెర్చ్ అండ్ రెస్క్యూ, అగ్రికల్చర్ తదితర విభాగాల్లో డ్రోన్‌లను వినియోగిస్తున్నాం. డ్రోన్ టెక్నాలజీ, డిజైన్, ఇంటిగ్రేషన్, ఆర్కిటెక్చర్ తదితర రంగాల్లో విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ఇజ్రాయెల్‌లోని డ్రోనిక్స్ ఇంజినీరింగ్ లిమిటెడ్ సహకారంతో డ్రోన్ ఆర్ అండ్ డి సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి కళాశాల తీసుకున్న చొరవను అభినందిస్తున్నా అన్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్.
Read Also: LSG vs CSK: చెన్నై బౌలర్ల ధాటికి లక్నో కుదేలు.. 10 ఓవర్లలో స్కోరు ఇది!