SLBC Tunnel Tragedy: SLBC టన్నెల్ పని సమయంలో సంభవించిన ఘోర ప్రమాదం ఇంకా అందరినీ కలిచివేస్తోంది. ఈ ప్రమాదంలో టన్నెల్ లోపల 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. నీటి ముంపు, టన్నెల్ కూలిన కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అప్పటి నుంచి ఈ ఘటనకు సంబంధించిన రక్షణ చర్యలు విరామం లేకుండా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ (NDRF), SDRF, రెస్క్యూ టీమ్స్, పోలీసు విభాగం, ఫోరెన్సిక్, వైద్య బృందాలు శ్రమిస్తున్నాయి. GPR (గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్) తో…
SDLC Tragedy: తెలంగాణలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్‌లో సంభవించిన ఘోర ప్రమాదం కారణంగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో వందలాది మంది పాల్గొంటున్నారు. భారత సైన్యం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయబడింది. క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సహాయక చర్యల్లో భాగంగా రెండు ఆర్మీ హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) నుంచి 120 మంది, ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF)…
SLBC Tunnel: శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాద ఘటన ఉత్కంఠను పెంచుతోంది. ప్రమాదం జరిగి దాదాపు 24 గంటలవుతున్న, చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. శిథిలాల్లో చిక్కుకున్న ఈ కార్మికులను రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. సంఘటన స్థలంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే, చిక్కుకున్న కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా వారి క్షేమంపై ఆశలు…
AV Ranganath : హైడ్రా నిర్వహించే సేవలలో డీఆర్‌ఎఫ్ (DRF) బృందాల పాత్ర అత్యంత కీలకమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజల అంచనాలను నెరవేర్చే విధంగా హైడ్రా కార్యకలాపాలు ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. గురువారం డీఆర్‌ఎఫ్‌లో ఔట్‌సోర్సింగ్ విధానంలో కొత్తగా నియమితులైన 357 మంది శిక్షణ ప్రారంభోత్సవంలో కమిషనర్ రంగనాథ్ ప్రసంగించారు. అంబర్‌పేట పోలీసు శిక్షణ కేంద్రంలో వీరికి ఒక…
AV Ranganath : ప్రమాదాలు జరిగిన వెంటనే ఆ సమాచారాన్ని క్షణాల్లో హైడ్రా (Hydra)కు చేరేలా టెక్నాలజీని అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున పాత ముంబై హైవే వద్ద షేక్‌పేట ప్రాంతంలోని డ్యూక్స్ అవెన్యూ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో రంగనాథ్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాదానికి గల కారణాలను హైడ్రా డీఆర్ఎఫ్ (Hydra DRF) బృందం , ఫైర్ సిబ్బందితో చర్చించారు. డ్యూక్స్ అవెన్యూ భవనంలో…
HYDRA : హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ (హైడ్రా) విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరింత పటిష్ఠ చర్యలకు దారితీసింది. ఈ క్రమంలో హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తూ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బుద్ధభవన్ భవనంలోని B-బ్లాక్‌లో ఈ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. హైడ్రాకు విస్తృతమైన అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నగరంలోని…
పెంగల్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ వెల్లడించిన ప్రకారం, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర జల శక్తి శాఖ, పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాన్ని హెచ్చరించింది.
డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌పై హైడ్రా కమిషనర్ సమీక్ష నిర్వహించారు. నగరంలో వరదలు, కారణాలు, ఉపశమన చర్యలు (డిజాస్టర్ మేనేజ్‌మెంట్)పై బుధవారం హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమీక్ష చేశారు. బెంగళూరులో అనుసరిస్తున్న విధానాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కర్ణాటక రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ కేంద్రం మాజీ డైరెక్టర్ డా. జీఎస్ శ్రీనివాస్ రెడ్డి వివరించారు. బెంగళూరుతో పాటు.. దేశంలోని ఇతర పట్టణాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి సమన్వయంతో మెరుగైన వ్యవస్థను రూపొందించడంపై కసరత్తు…
బాపట్ల జిల్లా కొల్లూరు మండలం లో, ఇటీవల వచ్చిన వరదల దెబ్బకు అనేక కుటుంబాలు విలువలాడుతున్నాయి… అధికారుల నిర్లక్ష్యంతో, లంక గ్రామాల్లో ఇప్పటికీ కొన్ని కుటుంబాలకు కనీస నష్టపరిహారం అందనేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి… దీంతో సర్వం కోల్పోయిన వలస కుటుంబాలు, చెట్ల కింద పుట్ల గట్టున తలదాచుకుంటున్నారు… 10 సంవత్సరాల క్రితం గోదావరి జిల్లా నుండి, వలస వచ్చిన కొన్ని కుటుంబాలు, కొల్లూరు సమీపంలో నివాసం ఉంటున్నాయి, స్థానికంగా ఇటుక బట్టీల్లో, ఇతర వ్యవసాయ భూముల్లో కూలి…