టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం ఒక హిట్ కోసం ఆరాటపడుతున్నాడు. ఇటీవల గోపీచంద్ నటించిన సీటిమార్ ప్రేక్షకులను నిరాశపరిచిన విషయం విదితమే. ఇక దీంతో తన తదుపరి చిత్రంతో ఎలాగైనా విజయం అందుకోవాలని తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఇకపోతే ప్రస్తుతం గోపిచంద్ తనకు రెండు విజయాలను అందించిన శ్రీవాస్ దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్న విషయం విదితమే. కొన్నిరోజుల క్రితం గోపీచంద్ 30 వ సినిమాగా పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా ఇటీవలే మైసూర్ లో…
మాచో స్టార్ గోపీచంద్ 30వ చిత్రంపై ఈ రోజు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కు శ్రీవాస్ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఇది వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. వీరిద్దరూ గతంలో రెండుసార్లు కలిసి పని చేశారు. లక్ష్యం, లౌక్యం చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. మరిన్ని వివరాలను…