టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ తన ప్రేయసి, హీరోయిన్ చాందినీ రావుని సైలెంటుగా పెళ్లి చేసుకున్నాడు. తిరుమలలో వీరి వివాహం జరిగింది. పెళ్ళికి కలర్ ఫోటో హీరో సుహాస్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలను సందీప్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సందీప్-చాందిని వివాహం తిరుమలలో జరిగినట్టు సమాచారం. సందీప్ రాజ్ షార్ట్ ఫిల్మ్స్‌తో నటుడు, దర్శకుడిగా కెరీర్ ఆరంభించారు.…