జూ. ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ‘జై లవ కుశ’లో తాను చెప్పిన ‘ఘట్టమేదైనా, పాత్రేదైనా’ అన్నట్టు.. ఎలాంటి పాత్ర ఇచ్చినా అవలీలగా చేసేస్తాడు. ఇతని నటనలో సహజత్వం ఉట్టిపడుతుందే తప్ప.. ఎక్కడా ఫేక్ కనిపించదు. ఈతరం హీరోల్లో నవరసాల్ని పండింగల హీరో ఎవరైనా ఉన్నారంటే, అది తారక్ అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. సాక్షాత్తూ.. దర్శకధీరుడు రాజమౌళి లాంటోడే తన ఫేవరేట్ హీరో అని తారక్ చెప్పాడంటే, అతడు ఎంత విలక్షణ…