ఈ యేడాది ప్రారంభంలోనే ఆది సాయికుమార్ నటించిన ‘అతిథి దేవో భవ’ చిత్రం విడుదలైంది. ఇదే సమయంలో అతను నటిస్తున్న దాదాపు ఐదారు చిత్రాలు సెట్స్ పై వివిధ దశలలో ఉన్నాయి. వాటిలో ఒకటి ‘తీస్ మార్ ఖాన్’. ఇటీవల షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు సోమవారం మొదలయ్యాయి. అతిత్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ విషయంలో డిఫరెంట్‌గా దూసుకుపోతోంది ‘తీస్ మార్ ఖాన్’ టీమ్. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్…