బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ నటించిన “జెర్సీ” మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. నాని హీరోగా నటించిన “జెర్సీ” తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ తో “జెర్సీ” చిత్రం షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా హిందీలో రీమేక్ అయ్యింది. ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ తో మరోసారి తన సత్తా చాటిన షాహిద్ కపూర్ ఇప్పుడు తెలుగు సినిమా ‘జెర్సీ’ని హిందీలోనూ అదే…