PM Modi: రెండు రోజుల పర్యటన కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ వచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రోటోకాల్‌ను పట్టించుకోకుండా, స్వయంగా ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్టుకు వెళ్లి పుతిన్‌ను ఘనంగా స్వాగతించారు. ప్రధాని మోడీ కొంత మంది విదేశీ అతిథుల కోసం మాత్రమే ఇలా ప్రోటోకాల్‌ను బ్రేక్ చేసి, స్వయంగా రిసీవ్ చేసుకున్నారు.
తాజాగా జరిగిన ‘భైరవం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మంచు మనోజ్ మాట్లాడుతూ, ‘ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఈ జన్మకు నేను మోహన్ బాబు గారి కొడుకుని’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే, తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ మీడియాతో ముచ్చటించిన క్రమంలో, ఒక మీడియా ప్రతినిధి, ‘మోహన్ బాబు కుమారుడిగా మీరు ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు?’ అని ప్రశ్నించారు. దానికి మనోజ్ స్పందిస్తూ, ‘ఆయన నుంచి ముందుగా నేర్చుకున్న విషయం ఎవరినీ మోసం…
భారతదేశం, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణలో తన పరిపాలనా వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. భారత్, పాకిస్థాన్ మధ్య అణు యుద్ధం లాంటి పరిస్థితిని నివారించడంలో అమెరికా పెద్ద దౌత్య విజయాన్ని సాధించిందని చెప్పారు. అయితే ఈ అంశంలో తనకు సరైన క్రెడిట్ ఇవ్వలేదని ట్రంప్ శనివారం ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరును భారత్ ఎండగట్టనుంది. ఉగ్రవాదాన్ని మన దేశంపైకి ఎగదోస్తున్న తీరును ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లనుంది. ఇప్పటికే పహల్గాం ఘాతుకాన్ని అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్‌పై భారత్ దౌత్య యుద్ధం చేయాలని నిర్ణయించింది. ప్రపంచ దేశాలకు అఖిలపక్ష ప్రతినిధి బృందాలు వెళ్లనున్నాయి.. మోడీ సర్కార్ ఏడు డెలిగేషన్స్‌ను ఏర్పాటు చేసింది. అమెరికా వెళ్లే ప్రతినిధి బృందానికి శశిథరూర్ నేతృత్వం వహించనున్నారు.
పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో భారత సిబ్బందిలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని, ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని దోవల్ పేర్కొన్నారు. యుద్ధం భారత్ తమ ఛాయిస్ కాదని ఆయన నొక్కి చెప్పారు.
చైనాతో దౌత్యానికి సమయం పడుతుందని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. గత మూడేళ్లలో చర్చల ద్వారా తూర్పు లడఖ్‌లో ఐదు, ఆరు ఘర్షణ పాయింట్లలో భారత్, చైనాలు పురోగతి సాధించాయని తెలిపారు.
ఉక్రెయిన్- రష్యా యుద్ధం సరికొత్త ప్రపంచ మార్పులకు దారితీస్తోంది. అమెరికా, రష్యా మధ్య పాత పగలు ఈ సంక్షోభంతో మరోసారి బయటపడ్డాయి. ప్రస్తుత పరిస్థితి ప్రచ్ఛన్న యుద్ధ రోజులను తలపిస్తోంది. ఈ క్రమంలో అమెరికా, రష్యా అతి పెద్ద దేశాలైన చైనా, భారత్‌ను పూర్తిగా తమ వైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి వ్యతిరేకంగా మార్చి 2న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రవేశ పెట్టిన తీర్మానానికి 141 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి.…