తమిళ స్టార్ హీరో విజయ్ టాలీవుడ్ మీద కన్నేశాడా? అవుననే లాగానే ఉన్నాయి పరిణామాలు అయితే! కోలీవుడ్ లో ఇళయదళపతిగా విజయ్ కి తిరుగులేదు. అయితే, సూర్య, కార్తీ, విశాల్, ధనుష్ లాంటి ఇతర తమిళ హీరోల్లాగా విజయ్ ఇంతకు ముందు ఎప్పుడూ తెలుగు మార్కెట్ పై పెద్దగా గురి పెట్టలేదు. ఈసారి మాత్రం టాలీవుడ్ ని సీరియస్ గా తీసుకుంటున్నాడు. ‘మాస్టర్’ సినిమాతో ఇక్కడ కూడా మంచి కలెక్షన్లే వసూలు చేశాడు విజయ్…
‘దళపతి 66’ ప్రాజెక్ట్ తో తొలి సారి డైరెక్ట్ తెలుగు మూవీ చేస్తున్నాడు విజయ్. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కబోతోంది బైలింగ్యువల్. అయితే, విజయ్ టాలీవుడ్ లోకి తన 66వ చిత్రంతో కాలుమోపనుండటంతో… అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సైతం విజయ్ కోసం ప్రయత్నిస్తున్నాడట. గీతా అర్ట్స్ అధినేత ఓ భారీ తెలుగు, తమిళ్ బైలింగ్యువల్ ప్లాన్ చేస్తున్నాడట…
ఇళయదళపతి తెలుగు మార్కెట్ ను కూడా ఇక మీద దృష్టిలో పెట్టుకోదలిస్తే అల్లు అరవింద్ కంటే మించిన గ్రేట్ ఛాయిస్ ఇంకెవరూ ఉండరు. దిల్ రాజు తరువాత అంతటి స్థాయిలో బడ్జెట్ పెట్టి ఆయనతో సినిమా చేయగలిగేది అరవింద్ మాత్రమే. ఆయనతో బైలింగ్యువల్ చేస్తే విజయ్ కి తెలుగులోనూ, తమిళంలోనూ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ పక్కా! మరి కోలీవుడ్ సూపర్ స్టార్ మన స్టార్ ప్రొడ్యూసర్ కి డేట్స్ ఇస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ…