ఢిల్లీ లో జరిగిన స్కామ్‌పై దేశ వ్యాప్తంగా చర్చ జరిగిందని.. ఢిల్లీ కన్నా పది రెట్లు ఎక్కువ స్కామ్ ఏపీలో జరిగిందని మంత్రి పార్థసారథి అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచం అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ వైపు వెళితే.. గత ప్రభుత్వం మాత్రం లిక్కర్‌లో 98 శాతం నగదు లావాదేవీలు జరిపిందన్నారు. ప్రజల నుంచి ఎందుకు నగదు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
Cash Transaction: దేశంలోని ప్రజలు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వారి ఆదాయానికి అనుగుణంగా పన్ను చెల్లించాలని మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఐటీ శాఖ ఒకప్పటిలా లేదు.
Cash Limit at Home : దేశంలో డిజిటల్ లావాదేవీలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇంట్లో నగదు ఉంచడం కూడా తగ్గించేశారు. కానీ ఎమర్జెన్సీ వస్తే ప్రజలకు హఠాత్తుగా నగదు అవసరం అవుతుంది.
RBI to launch Digital Rupee pilot in 4 cities today: క్యాష్ లెస్ ఎకానమీ కోసం దేశం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. దీన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఆర్బీఐ నేడు డిజిటల్ రూపాయిని ప్రారంభించనుంది. 2016 నుంచి భారతదేశం అంతటా డిజిటల్ లావాదేవీలను భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే నేటి నుంచి ప్రయోగాత్మకంగా ఇండియాలో నాలుగు నగరాల్లో డిజిటల్ రూపాయిని ప్రారంభించనుంది.
RBI Set To Launch Retail Digital Rupee: రిలైట్ డిజిటల్ రూపీ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఆర్‌బీఐ సిద్ధమైంది. పర్సన్ టూ పర్సన్, పర్సన్ టూ మర్చంట్ ఇలా డిజిటల్ రూపాయిలో లావాదేవీలు ప్రారంభించనుంది ఆర్‌బీఐ. కస్టమర్స్ డిజిటల్ వాలెట్ల ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చని ఆర్‌బీఐ పేర్కొంది. ఆర్‌బీఐ డిజిటల్ కరెన్సీ కార్యక్రమంలో పాల్గొనే బ్యాంకులకు చెందిన డిజిటల్ వాటెట్ల ద్వారా మాత్రమే డిజిటల్ రూపాయితో లావాదేవీలు జరగనున్నాయి. గురువారం నుంచి కొన్ని నగరాల్లో ఈ…