Digital arrest: డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ దేశంలో ఎక్కువ జరుగుతున్నాయి. పోలీస్ అధికారులు, ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులగా ఫోజు కొడుతూ స్కామర్లు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు.
Digital Arrest: ఇటీవల కాలంలో ‘‘డిజిటల్ అరెస్ట్’’ మోసాలు చాలా పెరిగాయి. ఇలాంటి నేరాలు పెరగడంపై ప్రధాని నరేంద్రమోడీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ అధికారుల, పోలీసులుగా నటిస్తూ బాధితులను బ్లాక్‌మెయిల్ చేసి, అందినకాడికి దండుకోవడాన్ని డిజిటల్ అరెస్టులుగా పిలుస్తారు. బాధితులు ఏం చేయాలో తెలియక ఆ సమయంలో స్కామర్లకు డబ్బులు ఇస్తున్నారు.
దేశంలో సైబర్ స్కామ్‌లు పెరిగిపోతున్నాయి. అమాయకులను లక్ష్యంగా చేసుకుని కేటుగాళ్లు నగదు దొంగిలిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ చేసి కోట్లు కొల్లగొడుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్‌లో చోటుచేసుకుంది.
Digital Arrest Fraud: ప్రస్తుత రోజుల్లో దేశంలో సైబర్ నేరాల కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగా ‘డిజిటల్ అరెస్ట్’ సంబంధించి కేసులు తెరపైకి వస్తున్నాయి. ‘డిజిటల్ అరెస్ట్’ ఒకరకంగా చెప్పాలంటే మానసికంగా ఎవరినైనా నియంత్రించడం లాంటిదే. ఒక్క ఫోన్ కాల్‌తో దీని ఉచ్చులో పడిన వ్యక్తులు లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లే. తాజాగా బాంబే ఐఐటీ విద్యార్థి ఇలాంటి మోసానికి పాల్పడ్డాడు. ఐఐటీ బాంబే విద్యార్థి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)లో ఉద్యోగిగా నటించి…
దేశంలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ క్రైమ్ పోలీసులు ఎంత పగడ్బందీగా చర్యలు చేపట్టినా నేరస్థులు మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణమైన సైబర్ క్రైమ్ వెలుగు చూసింది. 70 ఏళ్ల రిటైర్డ్ ఇంజనీర్‌ను ఎనిమిది గంటల పాటు డిజిటల్ అరెస్ట్ చేసి రూ.10.3 కోట్లు కొల్లగొట్టారు.
Digital Arrest Scam: ఇటీవల కాలంలో ‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్స్ దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి. సాక్ష్యాత్తు ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ డిజిటల్ అరెస్ట్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈడీ, ఐటీ, పోలీసు డిపార్ట్‌మెంట్‌కి చెందిన అధికారుల తీరు ఫోజు కొడుతూ, అమాయకుల నుంచి డబ్బులు కాజేస్తున్నారు.
పెరుగుతున్న 'డిజిటల్ అరెస్ట్' కేసులపై ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నివారించడానికి.. ' ఆలోచించండి, చర్య తీసుకోండి' అనే మంత్రాన్ని దేశప్రజలతో పంచుకున్నారు.
సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి అనేక పద్ధతులను ఉపయోగిస్తారు. ఈ రోజుల్లో డిజిటల్ అరెస్ట్ స్కామ్ చాలా చర్చనీయాంశమైంది. ఈ రకమైన స్కామ్‌లో.. మోసగాళ్ళు అన్ని రకాల ప్రజల లక్ష్యంగా చేసుకుని, ఆధార్ కార్డ్ లేదా నకిలీ నంబర్‌ను మిస్ యూజ్ పేరుతో భయపెట్టి ఆపై వారిని డిజిటల్‌గా అరెస్టు చేస్తారు.
Agra Shocker: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో దారుణం జరిగింది. సైబర్ నేరగాళ్ల నకిలీ బెదిరింపులకు, బ్లాక్‌మెయిల్‌కి భయపడిన ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందించింది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న బాధిత మహిళకు, ఆమె కూతురు ‘‘సెక్స్ రాకెట్’’ ఇరుక్కుందని నేరగాళ్లు కాల్ చేసి బెదిరించారు.