Gujarat: 90 ఏళ్ల వృద్ధుడు డిజిటల్ అరెస్ట్.. రూ.కోటి నగదు మాయం
- 90 ఏళ్ల వృద్ధుడు డిజిటల్ అరెస్ట్
- రూ.కోటి నగదు మాయం
- గుజరాత్‌లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో సైబర్ స్కామ్‌లు పెరిగిపోతున్నాయి. అమాయకులను లక్ష్యంగా చేసుకుని కేటుగాళ్లు నగదు దొంగిలిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ చేసి కోట్లు కొల్లగొడుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్‌లో చోటుచేసుకుంది.

Also Read
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
గుజరాత్‌కు చెందిన 90 ఏళ్ల వృద్ధుడిని చైనాలో ఓ ముఠాతో కలిసి రాకెట్ నడిపిస్తున్న గ్యాంగ్ డిజిటల్ అరెస్ట్ చేసి రూ.కోటి నొక్కేశారు. సీబీఐ అధికారులుగా నటిస్తూ 15 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్‌లో ఉంచారు. పార్శిల్‌లో డ్రగ్స్ దొరికాయని బెదిరింపులకు దిగారు. మీ పేరు మీద ముంబై నుంచి చైనాకు కొరియర్ పంపినట్లు హడలెత్తించారు. అతని బ్యాంకు ఖాతా నుంచి ముఠా సభ్యులు రూ. 1,15,00,000 బదిలీ చేసుకున్నారు. సంఘటన గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు సూరత్ సైబర్ పోలీసులకు అక్టోబర 29న ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఐదుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారి పార్థ్ గోపాని కోసం గాలిస్తున్నారు. పార్థ్ గోపానీ కంబోడియాలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వృద్ధుడు సంపాదించిన కోటి రూపాయులు కేటుగాళ్లు నొక్కేయడంతో లబోదిబో అంటున్నాడు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) భవేష్ రోజియా మాట్లాడుతూ.. స్టాక్ మార్కెట్‌లో వ్యాపారం చేసే సీనియర్ సిటిజన్‌కు స్కామ్‌స్టర్లలో ఒకరి నుంచి వాట్సాప్ కాల్ వచ్చిందని, అతను తనను తాను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్నాడని తెలిపారు. ముంబయి నుంచి చైనాకు సీనియర్ సిటిజన్ పేరుతో కొరియర్‌లో పంపిన పార్శిల్‌లో 400 గ్రాముల ఎండీ డ్రగ్స్ లభించినట్లు బెదిరించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామని బెదిరించారు. విచారణ పేరుతో 15 రోజులు ఏడిపించారు. మొత్తానికి రూ.కోటికిపైగా నగదు నొక్కేశారు. అరెస్టయిన వారి నుంచి వివిధ బ్యాంకులకు చెందిన 46 డెబిట్ కార్డులు, 23 బ్యాంక్ చెక్ బుక్‌లు, ఒక వాహనం, నాలుగు వేర్వేరు సంస్థల రబ్బర్ స్టాంపులు, 9 మొబైల్ ఫోన్లు, 28 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు రమేష్ సురానా, ఉమేష్ జింజాలా, నరేష్ సురానా, రాజేష్ దేవరా, గౌరంగ్ రఖోలియా ఉన్నారు.

తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?