హైదరాబాద్ గచ్చిబౌలిలో థర్మో ఫిషర్స్ ఇండియా ఇంజినీరింగ్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో థర్మో ఫిషర్స్ పరిశోధన, అభివృద్ధి సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. 15 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ సంస్థ ఏర్పాటైందని తెలిపారు. థర్మో షిషర్స్ ఇండియా సంస్థ పరిశోధన కోసం ప్రతి ఏటా 1.4 బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే ఉత్పత్తి, భూ, నీటి వనరులపై పరిశోధిస్తోందని పేర్కొన్నారు. 2030 లోపు…