టీడీపీ, చంద్రబాబు మేనిపెస్టోను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. మేనిఫెస్టోను అమలుపరచి విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించలేదన్నారు. 2014 నుంచి 2019 కాదు , చంద్రబాబు 14 ఏండ్ల సీఎంగా ఎప్పుడూ మేనిఫెస్టో అమలు చేయలేదన్నారు.
వాలంటీర్లు అనే వారు లేరు.. ఇప్పుడు వారంతా పార్టీ కార్యకర్తలే అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వాలంటీర్లు అంతా రిజైన్ చేసారు.. గతంలో కూడా పార్టీ ఆశయాలు నమ్మే కుటుంబం నుంచి వచ్చినవారే .. టీడీపీ ఎన్ని అవమానాలు చేసిన ఐదేళ్లు నిలబడి పని చేశారు.. అప్పుడు ఓ మాట.. ఇప్పుడో మాట చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కి అందరూ ఓటేయాలని కొందరు ప్రజల ముందుకు వస్తున్నారు.. చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ కి ఎందుకు ప్రజలు ఓటేయ్యాలని ప్రశ్నించారు. ఒక ఇల్లు ఇచ్చారా.. సెంటు జాగా ఇచ్చారా.? ఓటెందుకు వేయాలన్నారు. నిన్న ఒకటో తేదీ పింఛన్ డబ్బులు సుర్యోదయం కాకముందే ఇచ్చేసేవారు.. పింఛన్ ఎందుకు రాలేదో ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. వాలంటీర్లు పింఛన్ ఇవ్వొద్దని చంద్రబాబు పిటిషన్ పెట్టేసాడని…
రానున్న ఎన్నికల్లో పోటీపై మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జీవితానికి విశ్రాంతి అవసరమనిపిస్తోందని అన్నారు. కానీ.. పార్టీ కోసం పనిచేస్తానని సీఎం జగన్ కు చెప్పానని తెలిపారు. కాగా.. ఈసారి పోటీలో ఉండాలని సీఎం అంటున్నారు.. పార్టీ కష్టకాలంలో వదిలేసానని అపవాదు తనపై రాకూడదని చెప్పారు. మూడు రోజుల క్రిందట తాను ముఖ్యమంత్రిని కలిసానని.. ఈసారి తనను ఎంపీకి పోటీ చేసి తమ బాబుని అసెంబ్లీకి పంపిద్దామని తనతో సీఎం చెప్పినట్లు తెలిపారు.
టైటిలింగ్ యాక్ట్ చట్టం ఇంకా అమలు చేయలేదని.. ఈ చట్టంపై అడ్వకేట్స్ కొన్ని అభ్యంతరాలు చెబుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. రాష్ట్రంలో త్వరితగతిన రీ సర్వే పూర్తి అవుతుందని ఆయన ప్రకటించారు. ఇంకా రూల్స్ తయారు చేయలేదు , అసెంబ్లీ చర్చించలేదని.. న్యాయవాదుల సలహాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో సామాజిక సాధికారిక యాత్ర బహిరంగ సభలో మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలకవ్యాఖ్యలు చేశారు. దేశంలో 75 సంవత్సరాలలో రాష్ట్రాల్లో ఏర్పడిన ప్రభుత్వాలు తమ పార్టీకి ఓటు వేసిన వారికే సంక్షేమం ఇచ్చారని.. చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీ ఏర్పాటు చేసి ప్రజల్ని బెదిరించి కొంతమందికి మాత్రమే సంక్షేమం అందించారని ఆయన వ్యాఖ్యానించారు.
గడచిన 75 సంవత్సరాల పాలన కంటే సీఎం జగన్ పాలన భిన్నమైనది అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చాలనేదే జగన్ తాపత్రయం పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎంతో మంది రాజకీయ అవకాశం కల్పించాలని ఉద్యమాలు చేశారని మంత్రి చెప్పారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సాధికారత దిశగా నడిపించిన వైనాన్ని, వారికి చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర మంగళవారం విజయనగరం జిల్లాలో నెల్లిమర్లలో జరిగింది. నెల్లిమర్లలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగింది. మంత్రులు సీదిరి అప్పలరాజు, రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి తదితరులు హాజరయ్యారు.