మూడు రాజధానుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో కాక రేపుతూనే ఉంది.. మూడు రాజధానుల ఏర్పాటు వైపు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుండగా.. విపక్షాలు మాత్రం.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.. అయితే, ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు పేరుతో నిర్వహిస్తోన్న కార్యక్రమాలపై మండిపడ్డారు.. జన్మభూమి కార్యకర్తలు…
రాష్ర్టం మొత్తంలో ఎక్కడైనా నయాపైసా ధర్మాన ప్రసాద్ తీసుకున్నాడని చెప్పగలరా..? అని సవాల్ విసిరారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కల్లేపల్లి గ్రామం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు కోట్లాది రుపాయల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక, కేసులు విచారణకు రాకుండా స్టేలు తీసుకువస్తుంటాడు అని ఆరోపించారు.. మరోవైపు, నన్ను…
పని చేయడం చేతగాకపోతే స్వచ్ఛందంగా తప్పుకోండి.. లేదా మేమే తొలగిస్తాం అంటూ గ్రామ, సచివాలయ వాలంటీర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
ధర్మాన కృష్ణదాస్.. ధర్మాన ప్రసాదరావు. ఇద్దరూ సోదరులే. కృష్ణదాస్ డిప్యూటీ సీఎంగా చేస్తే.. మొన్నటి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో అన్నను సాగనంపి.. తమ్ముడు ప్రసాదరావును మంత్రిని చేశారు. కృష్ణదాస్‌కు పార్టీ పగ్గాలు అప్పగించారు. కృష్ణదాస్ మంత్రిగా ఉండగా ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ప్రసాదరావు.. నేడు అన్న కృష్ణదాస్ పార్టీ అధ్యక్షుడిగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు తమ్ముడు డుమ్మా కొట్టేస్తున్నారు. మంత్రి పదవిలో ఉండగా దాసన్న చుట్టూ ప్రదర్శన చేసింది కేడర్. ప్రసాదరావు మంత్రి కావడంతో ఆ…
మంత్రిగా మారాక ధర్మాన ప్రసాదరావు తన శాఖపై పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరోసారి రెవిన్యూశాఖ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన. నిజాయితి గల పరిపాలన ప్రజలకు ఇవ్వాలన్నారు. త్వరితగతిన సేవలు అందించాలి. దీనికోసం వ్యక్తులు లేదా వ్యవస్థలను సంస్కరించాలన్నారు. ప్రజలనుండి రెవిన్యూ శాఖ పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, రెవిన్యూ శాఖని అన్నానంటే .నేను కూడా…
రెవిన్యూ శాఖలో చాలా సమస్యలు ఉన్నాయన్నారు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. అవినితి ఎక్కువగా ఉందని, ఇది అవమానకరంగా ఉందన్నారాయన.. అందుకే అనేక పథకాలను.. లబ్ధిదారులకే నేరుగా ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. అయితే, ఇదే సందర్భంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ధర్మాన.. ప్రజలు నిజాయితీ కలిగిన నాయకులను కోరుకుంటున్నారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ ను ప్రజలు నాలుగు సార్లు ముఖ్యమంత్రిని చేశారని గుర్తుచేసిన ఆయన.. ఇది కేవలం ఆయన నిజాయితీవల్లే సాధ్యమైందన్నారు. ఢిల్లీలో ఆప్…
ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ధర్మాన ప్రసాదరావు.. కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా నియమితులయ్యారు.. ఇక, ఇవాళ రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ధర్మాన ప్రసాదరావు.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. సీఎం వైఎస్ జగన్ లక్ష్యాలు నెరవేరుస్తామని ప్రకటించారు.. రెవెన్యూ అని కాకుండా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే బావుండేదన్న ఆయన.. సీనియర్ అధికారులతో కలిసి ఒక టీంగా పని చేయడం నా అలవాటు అన్నారు.. అనేక చట్టాల వల్ల చాలా భూములు వివాదాల్లో చిక్కుకుంటాయి.. దీని…
ఏపీ రాజధాని అమరావతిపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్కు లేఖ రాశారు. రాజధానిపై శాసన అధికారం తీసుకోవడానికి ప్రభుత్వానికి హక్కు లేదు అంటూ హైకోర్టు వ్యాఖ్యానించడం తనను బాధించిందని లేఖలో ధర్మాన తెలిపారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిపాలనకు సంబంధించి శాసన నిర్మాణం, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల పరిధులను స్పష్టంగా నిర్ణయించడం జరిగిందని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య…