ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులపై చర్చ జరుగుతోన్న సమయంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రిగా దిగిపోతున్నానని, తన సోదరుడు ధర్మాన ప్రసాదరావు మంత్రి కాబోతున్నారని పేర్కొన్నారు.. గతంలో తమ్ముడు ప్రసాదరావు మంత్రిగా ఉన్నప్పుడు… నరసన్నపేట ఉపఎన్నికలో తనపై మరో సోదరుడు రామదాసును బరిలోకి దించాడని.. ఆ ధర్మ యుద్ధంలో తానే గెలిచానని కృష్ణదాస్ గుర్తుచేసుకున్నారు.. 2019 ఎన్నికల్లో తమ్ముడు ప్రసాదరావు కూడా వైసీపీ నుంచి పోటీ చేశారు.. ఎన్నికల్లో ఇద్దరం గెలిచామని చెప్పారు.…
ఆ జిల్లాతో ఆమెకు ఎప్పట్నుంచో పరిచయం. అప్పుడెప్పుడో ఒకసారి ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఇటీవల ఓ కార్యక్రమం కోసం జిల్లాకు వచ్చిన ఆమె.. ఓ సీనియర్ నేతను ఉద్దేశించి.. మీరు కూడా మంత్రి అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అని ఓ కామెంట్ పాస్ చేశారు. ఆ వ్యాఖ్యలు ఆ నాయకుడి అనుచరులకు సంతోషానివ్వగా.. జిల్లా రాజకీయాల్లో మాత్రం కొత్త పెట్టేలా ఉన్నాయట. ఇంతకీ ఎవరామె? ఏంటా కామెంట్స్? ప్రసాదరావును ఉద్దేశించి లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలపై…