నందమూరి బాలకృష్ణతో అత్యధిక చిత్రాలు రూపొందించిన దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి. ఒకప్పుడు బాలకృష్ణ, కోదండరామిరెడ్డి కాంబినేషన్ విశేషాదరణ చూరగొంది. వీరిద్దరి కాంబినేషన్ లో అంతకు ముందు ‘రక్తాభిషేకం’ చిత్రం నిర్మించి, విజయం సాధించిన ‘శ్రీ రాజీవ ప్రొడక్షన్స్’ అధినేత కె.సి.రెడ్డి నిర్మించిన రెండవ చిత్రం ‘ధర్మక్షేత్రం’. ‘రక్తాభిషేకం’ను మ్యూజికల్ హిట్ గా నిలిపిన ఇళయరాజా, ఈ చిత్రానికి కూడా స్వరకల్పన చేసి, దీనిని మ్యూజికల్ హిట్ గా మలిచారు. 1992 ఫిబ్రవరి 14న ‘ధర్మక్షేత్రం’ జనం ముందు నిలచింది.…