ప్రజలు అవయవ దానానికి ముందుకు రావాలని జీవన్ దాన్ ఇంచార్జి డాక్టర్ జి. స్వర్ణలత పిలుపునిచ్చారు. దేశంలో అవయవాల కోసం ఎదురుచూస్తున్న వారు చాలామంది ఉన్నారని, మరణించిన వ్యక్తి అవయవ దానం చేస్తే 8 నుంచి 9 మంది ప్రాణాలు కాపాడవచ్చన్నారు.
రాష్ట్రంలో సైబర్ నేరాల మినహా అన్ని రకాల నేరాలలో పూర్తిగా తగ్గుదలలో ఉన్నాయని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సైబర్ లిటరసీ గణనీయంగా పెరగడంతో పాటు సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని తెలిపారు.
దేశంలోనే తెలంగాణ పొలీసులు నెంబర్ వన్ అని హోంమంత్రి మహమూద్ ఆలీ అన్నారు. ఉమెన్ సేఫ్టీ వింగ్, తెలంగాణ పోలీస్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ యూత్ డే సందర్భంగా C.A.P. సైబర్ అంబాసిడర్స్ ప్లాట్ ఫామ్ లాంచ్ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ ఆలీ, డీజీపీ అంజనికుమార్ పాల్గొన్నారు.