పోలీస్ శాఖలోని ప్రతి స్థాయి పోలీస్ అధికారులకు నిర్దేశించిన ఫంక్షనల్ వర్టికల్స్ పనితీరును సాంకేతికంగా విశ్లేషించి, గణాంకాలలో మార్చి గ్రేడింగ్ ఇచ్చి ప్రోత్సహించడం ద్వారా మొత్తం పోలీసు వ్యవస్థ యొక్క పనితీరు మరింత సమర్ధవంత పనిచేసే విషయంపై నేడు సాయంత్రం డీజీపీ అంజనీ కుమార్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీపీ కార్యాలయంలో నేడు సాయంత్రం నిర్వహించిన సమావేశంలో, తెలంగాణా పోలీస్ శాఖలో అమలులో ఉన్న సంస్థాగత నిర్మాణం, ఫంక్షనల్ వర్టికల్స్ అంశాలపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగం అధికారులతో సవివరంగా సమీక్షించారు.
Read Also:Delhi : రాజధానిలో రెండేళ్ల గరిష్టస్థాయికి విద్యుత్ వినియోగంD
పోలీస్ శాఖలో ముఖ్యంగా పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించే ప్రతీ స్థాయి అధికారులు తమకు ప్రత్యేకంగా కేయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించే అంశంలో డీజీపీ కార్యాలయంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సమీక్షించాలని అంజనీ కుమార్ సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా ప్రతీ ఒక్క పోలీస్ అధికారి పనిచేసేలా, ముఖ్యంగా పోలీస్ శాఖపై ప్రతి ఒక్కరిలో నమ్మకం కుదిరేలా మరింత అంకిత భావంతో పనిచేసేలా విశ్లేషించాలని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధికారులను డీజీపీ కోరారు.
కేంద్ర హోంశాఖ వీడియో కాన్ఫరెన్స్
ఈశాన్య రాష్ట్రాల్లో జరుగనున్న శాసన సభ ఎన్నికల నిర్వహణకై తగు పోలీస్ బలగాలను పంపించే అంశంపై కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా నేడు తెలంగాణా తోపాటు పలు రాష్ట్రాల డీజీపీ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ డీజీపీ కార్యాలయం నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీజీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు.
సున్నిత ప్రాంతాలుగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో ఈ సంవత్సరం (2023 ) లో శాసన సభ ఎన్నికలు జరగనున్నందున, ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు సాఫీగా నిర్వహించేందుకుగాను అదనపు పోలీస్ బలగాలు అవసరమున్నాయని హోం శాఖ కార్యదర్శి ఏ.కే.భల్లా కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ ఎస్.కె. జైన్, బెటాలియన్స్ ఏ.డి.జి. అభిలాష బిష్త్ పాల్గొన్నారు